తెలంగాణ

డిజిటల్ పేమెంట్స్‌లో పేటిఎమ్ కొత్త కేటగిరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: పే టిఎమ్ సంస్థ డిజిటల్ చెల్లింపులను విస్తరించడంలో భాగంగా ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు, క్యాంటీన్లు, పార్కింగ్ ప్రదేశాలకు ప్రత్యేక టూల్స్‌ను ఏర్పాటు చేసిందని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. ప్రతి రోజూ తమ సంస్థ ద్వారా 20వేల లావాదేవీలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరకు నెలకు 20 లక్షలకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలోని అన్ని పెద్ద ప్యాథాలజీ ల్యాబ్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫార్మసీ, థైరోకేర్, డాక్టర్ లాల్ పాథ్ ల్యాబ్స్, అపోలో ఆసుపత్రి నెట్‌వర్క్ పే టిఎమ్ పరిధిలో చేరినట్లు ఆయన చెప్పారు. దేవాలయాల్లో కూడా పే టిఎమ్ చెల్లింపులు స్వీకరిస్తున్నారన్నారు. దేశంలో 2500 ఆటోమొబైల్ సర్వీసు కేంద్రాలతో తమకు టై అప్ ఉందన్నారు. 28 లక్షల మంది వ్యాపారులకు ఆఫ్‌లైన్ నెట్‌వర్క్ సేవలు అందిస్తున్నామన్నారు.