తెలంగాణ

ఆన్‌లైన్ దాడులపై ‘టాస్క్’ అటాక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సైబర్ సెక్యూరిటీ అత్యంత ప్రాముఖ్యత కలిగిన కీలక అంశం. ఆన్‌లైన్ ఖాతాలైనా, సోషల్ మీడియా అకౌంట్లపైనా ఇప్పటికే ఎన్నో సైబర్ దాడులు జరిగాయి. సైబర్ నేరగాళ్లు ఎంతో మంది ఖాతాలను తస్కరించి బ్యాంకుల్లోనూ, ఏటిఎంలలోగల డబ్బును కాజేశారు. ఎంతో మంది బాధితులు సిసిఎస్, సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. దీంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సైబర్ దాడులపై విద్యార్థుల చేత యుద్ధం ప్రకటించింది.
సైబర్ సెక్యూరిటీపై ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాథమిక శిక్షణ ఇచ్చి హ్యాకర్ల ఆటకట్టించేందుకు యత్నిస్తోంది. అదేవిధంగా సోషల్ మీడియా అకౌంట్లపై హ్యాకర్ల దాడిని ఎదుర్కొనేందుకు స్వీయ నియంత్రణపై టాస్క్ శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం అమెరికాకు చెందిన నెట్‌వర్కింగ్ సంస్థ ‘సిస్కో’ తెలంగాణ అకాడమీ ఫర్ సిల్క్ అండ్ నాలెడ్జ్ జతకట్టింది. ఈ మేరకు ఇటీవల శిక్షణపై ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సీపీపీ కోర్సుల్లో వేర్వేరుగా చిన్నస్థాయి నెట్‌వర్క్‌ల నియంత్రణ మొదలుకొని పెద్దపెద్ద కంపెనీలకు సంబంధించి సమాచార నియంత్రణ, డేటా సెక్యూరిటీ, సర్వర్ల నియంత్రణ వంటి అంశాలపై ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒక కంపెనీకి కావాల్సిన సెక్యూరిటీ నియమనిబంధనలను ఏ విధంగా రూపొందించాలి, హ్యాకర్లు తస్కరించిన డేటాను ఏ విధంగా తిరిగి పొందాలనే అంశాల్లోనూ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. మిగతా రంగాలతో పోలీస్తే సైబర్ సెక్యూరిటీ రంగంలో మూడింతల ఉద్యోగ కల్పన అవకాశాలు ఉన్నట్టుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు అనుగుణంగానే ఇంజనీరింగ్ విద్యార్థులను ఈ రంగం వైపు మళ్లించేందుకు టాస్క్ ప్రయత్నాలు చేస్తోంది. దీనితోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పైనా శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా సాఫ్ట్‌వేర్ వైపు చూస్తోన్న ఇంజనీరింగ్ విద్యార్థులకు ముఖ్యమైన సీపీపీ కోర్సును కూడా అందించనున్నట్టు తెలిసింది. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి సీసీఏ (సర్టిఫైడ్ అసోసియేట్ ప్రోగ్రామర్ సర్ట్ఫికేషన్) సర్ట్ఫికెట్‌ను అందించనున్నారు. అదేవిధంగా శిక్షణ పొందిన అభ్యర్థులకు టాస్క్ ద్వారా ఉధ్యోగ అవకాశాలు కల్పించనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి ప్రత్యేక ఐడీని కేటాయిస్తారు. దాని ద్వారా అభ్యర్థులు ప్రతి రోజూ సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్..వంటి అంశాలపై శిక్షణ పొందుతారు.