తెలంగాణ

గ్రూప్-2 తుది కీ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష తుది కీని ఖరారు చేశారు. నాలుగు పేపర్ల నుండి 17 ప్రశ్నలను తొలగించారు. మరో 8 ప్రశ్నలకు రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాధానాలు సరైనవని పేర్కొంది. వాటిలో ఏది రాసినా సరైన జవాబు అవుతుందని కమిషన్ తెలిపింది. తొలగించిన ప్రశ్నలను మినహాయించి మిగతా ప్రశ్నలకు మార్కులను లెక్కిస్తారు. పేపర్-1లో ఎ, బి సిరీస్‌లో 38,70,78,93,108,139 ప్రశ్నలను తొలగించారు. 17వ ప్రశ్నకు 3లేదా 4 సరైన జవాబుగా గుర్తించారు. 77వ ప్రశ్నకు 1,2,3లలో ఏది టిక్ చేసినా మార్కులు వస్తాయి. పేపర్-2లో 40,94,104,113,131 ప్రశ్నలను తొలగించారు. ఇందులో 28వ ప్రశ్నకు 2 లేదా 3 సరైన సమాధానాలుగా గుర్తించారు. పేపర్-3లో 20,53,124 ప్రశ్నలను తొలగించారు. ఈ పేపర్‌లో 59వ ప్రశ్నకు 1,2 సరైన సమాధానంగా గుర్తించారు. 94వ ప్రశ్నకు 2,3వ ఆప్షన్ సరైనదిగా గుర్తించారు. పేపర్-4లో 16,51,80వ ప్రశ్నలను తొలగించారు. 32వ ప్రశ్నకు 1,2 సమాధానాలు కూడా సరైనవిగా గుర్తించారు.
ఎఇఓ పోస్టుల ఫలితాలు వెల్లడి
టిఎస్‌పిఎస్‌సి నిర్వహించిన అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఎంపిక పరీక్ష ఫలితాలను కమిషన్ ప్రకటించింది. 1311 పోస్టులకు గానూ, 53 మంది అర్హులైన అభ్యర్థులు లేక 1258 పోస్టులకు జాబితాను ప్రకటించింది. 2015 డిసెంబర్ 30న 311 పోస్టులకు ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2016 ఏప్రిల్ 30న మరో నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. దీనికి అనుగుణంగా తొలి నోటిఫికేషన్‌కు 5034 మంది దరఖాస్తు చేయగా, 3824 మంది పరీక్షకు హాజరయ్యారు. మలి నొటిఫికేషన్‌కు 7645 మంది దరఖాస్తు చేయగా, 6479 మంది హాజరయ్యారు.