తెలంగాణ

పంటల దిగుబడి పెంచడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: భారతదేశంలో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని, సాంకేతిక ఆధునిక నైపుణ్యమే ఇందుకు కారణమని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) ప్రతినిధి బృందం ప్రతినిధి డాక్టర్ ఆర్.సి. మహేశ్వరి పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐసిఎఆర్ నిధులతో చేపట్టిన విద్య, పరిశోధన తదితర కార్యక్రమాలు, పథకాలను పరిశీలించేందుకు ఈ బృందం వచ్చింది. గుజరాత్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఆర్‌సి మహేశ్వరి ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ (రాజేంద్రనగర్) లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనాభవనంలో వైస్-్ఛన్సలర్ డాక్టర్ వి. ప్రవీణ్‌రావుతో ఈ బృందం కలిసి చర్చించింది. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్తగా ఫుడ్ టెక్నాలజీ కాలేజ్‌తో పాటు మరో రెండు వ్యవసాయ కాలేజీలను ప్రారంభించామని ప్రవీణ్‌రావు తెలిపారు. బోధన, పరిశోధనలో తమ యూనివర్సిటీ ఐసిఎఆర్ నేతృత్వంలో రాజేంద్రనగర్‌లో నడుస్తున్న పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేస్తోందని వివరించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కాలేజీలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ తరగతి గదిని ఆమె ప్రారంభించారు. వర్చ్యువల్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జగిత్యాల, అశ్వారావుపేటలలోని అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పంటల ఉత్పత్తులు పెంచాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, అందుకే వ్యవసాయ విద్య, పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె వివరించారు.
తెలంగాణలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నేతృత్వంలో జరుగుతున్న వ్యవసాయ విద్య, విస్తరణ, పరిశోధనలను ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఐసిఎఆర్ బృందానికి వివరించారు. ‘కాస్ట్ ఆఫ్ కల్టివేషన్’ పథకంపై రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరి, ప్రవీణ్‌రావుతోపాటు ఐసిఎఆర్ బృందం మెంబర్-సెక్రటరీ డాక్టర్ వెంకటేశ్వర్లు,కమిటీ సభ్యులు డాక్టర్ జెఎస్ భాటియా, డాక్టర్ ప్రభు, శ్రీరాధేశ్యాం తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సెల్‌ను ఐసిఎఆర్ బృందం సందర్శించింది. ఈ బృందం పర్యటన మంగళవారం కూడా కొనసాగుతుంది.