తెలంగాణ

ఆన్‌లైన్‌లో రెండు ప్రవేశ పరీక్షలు (తెలంగాణలో తొలి ప్రయోగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు రెండు ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. తెలంగాణలో ఉద్యోగాల ఎంపికకు పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇప్పటికే రిక్రూట్‌మెంట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించి అభ్యర్ధులను విజయవంతంగా ఎంపిక చేసింది. ఐఐటి జెఇఇ వంటి పరీక్షలు, బిట్‌శాట్ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్న ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే తెలంగాణలో తొలిసారిగా ఈ ఏడాది ఎమ్సెట్‌ను, పిజిఇసెట్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ పరీక్షకు తెలంగాణలో రెండు కేంద్రాలను మాత్రమే ఎంపిక చేశారు. హైదరాబాద్, వరంగల్‌లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎమ్సెట్‌కు తొలుత 20 వేలమంది అభ్యర్థులను ఆన్‌లైన్‌లో అనుమతిస్తారు. తొలుత కోరిన వారికి మాత్రమే అవకాశమిస్తారు. మిగిలిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే పిజిఇసెట్‌కు మాత్రం ఎంతమంది దరఖాస్తు చేసినా ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ఎమ్సెట్‌కు గత నెల 28 నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకూ దరఖాస్తులను అనుమతిస్తారు. పరీక్ష మే 2న జరగనుంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఇ, ఎంఆర్క్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి పిజిఇసెట్‌ను మే 30నుండి జూన్ 2వ తేదీ వరకూ రెండు దశల్లో ఆన్‌లైన్‌లో జరగనుంది. ఇందుకు రెండు పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్‌ను ఏర్పాటు చేసినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం చెప్పారు. ఆన్‌లైన్‌లో వెబ్ ఆధారితంగా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.