తెలంగాణ

భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: రైతులు, గ్రామీణ యువత అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ్భారతి ట్రస్ట్ పని చేస్తుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో స్వర్ణ్భారతి హైదరాబాద్ చాప్టర్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలంగాణలోనూ సేవా కార్యక్రమాలను ప్రారంభించేందుకు స్వర్ణ్భారతి ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. ఐటి సంస్థల భాగస్వామ్యంతో యువతకు స్వర్ణ్భారతి ట్రస్ట్ శిక్షణ ఇస్తోందని, ఎంతో మంది ఈ శిక్షణతో ప్రయోజనం పొందారని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడడం కాదు, ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, ఉద్యోగం పొందాలని కాకుండా ఉద్యోగాలు కల్పించాలి అనే ఆలోచన చేయాలని అన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వీటి ఫలితాలను మనం త్వరలోనే చూడనున్నామని అన్నారు. ఈ మార్పుల్లో చిన్న చిన్న సమస్యలు సహజమని, వాటిని తట్టుకుని నిలబడాలని అన్నారు. ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు కల్పించేందుకు పాలకులు ఆలోచించాలని, ప్రభుత్వాల కృషి ఈ దిశలో ఉండాలని అన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కన్నా శాశ్వత ప్రయోజనాలపై దృష్టి సారించాలని అన్నారు. తనకు రాజకీయ వారసులు లేరని, కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోకి వస్తానంటే, తాను ప్రోత్సహించనని చెప్పారు. వేల సంవత్సరాల సుసంపన్నమైన చరిత్ర మన దేశానికి సొంతమని, నేటి తరానికి మన చరిత్రను చెప్పాల్సిన బాధ్యత పెద్దలకు ఉందని అన్నారు. తన కుమార్తె దీపావెంకట్‌కు సమాజ సేవ చేయాలనే ఆసక్తి ఉందని, స్వర్ణ్భారతి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. గ్రామీణులకు ఉపాధి అవకాశాలు పెంచడం, ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడానికి ఈ ట్రస్ట్ కృషి చేస్తుందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని అన్నారు. బోధన ఆంగ్లమైనా భావన భారతీయమై ఉండాలని అన్నారు. మహానుభావుల గొప్పతనాన్ని పిల్లలకు చెప్పాలని వెంకయ్యనాయుడు సూచించారు.
స్వర్ణ్భారతి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు. ఈ ట్రస్ట్‌కు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు శిక్షణ ఇచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలల సాధన కోసం స్వర్ణ్భారతి ట్రస్ట్ కృషి చేస్తుందని అన్నారు. యువత ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు బండారు దత్తాత్రేయ తెలిపారు. మానవ వనరులు పుష్కలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు.
మైం హోమ్ గ్రూప్ సంస్థల అధినేత రామేశ్వరరావు ట్రస్ట్ ఏర్పాటుకు స్థలం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపిలు కొండా విశే్వశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు.

చిత్రం..శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో సోమవారం స్వర్ణ్భారతి హైదరాబాద్ చాప్టర్‌ను జ్యోతి
వెలిగించి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్. చిత్రంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ తదితరులు ఉన్నారు