తెలంగాణ

కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి టౌన్, జనవరి 16: కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ప్రజావాణి ఫిర్యాదుల కార్యాలయం ముందు వివాహిత మహిళ సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలంలోని ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకెటి అనిత ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చి నిరుత్సాహంతో తమకు న్యాయం జరగడం లేదంటూ విలేఖరులతో వాపోయింది. కొద్దిసేపటికే ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. స్థానికులు గమనించి కలెక్టర్ గన్‌మెన్‌కు తెలపడంతో బాధితురాలిని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అనిత కలెక్టర్‌తో తన గొడును వెల్లబోసుకుంటూ తన భర్త గంగాధర్‌రావు 2014లో మొక్కజొన్నల డబ్బులను తీసుకువస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదని పేర్కొన్నారు. పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశానన్నారు. కుమారుడు సాత్విక్, కుమార్తె స్పందనలతో అతి కష్టంతో తన జీవనాన్ని కొనసాగిస్తున్నానని వాపోయింది. ఇస్రోజివాడిలో అత్తింటి వారి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. ఈ విషయంపై కలెక్టర్ మాట్లాడుతూ, వెంటనే పిల్లలను ప్రభుత్వం వసతి గృహంలో చదివించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గంగాధర్‌రావు ఆచూకి గుర్తించేలా పోలీసులు కృషి చేస్తారన్నారు. అత్తింటి వారి వేధింపులకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం కామారెడ్డి రూరల్ సిఐ కోటేశ్వర్‌రావు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని బాధితురాలి వద్ద నుండి వివరాలు సేకరించారు. విచారణ జరిపి న్యాయం చేస్తానని తెలపడంతో అనిత తన పిల్లలతో పాటు తండ్రితో గ్రామానికి వెళ్లిపోయింది.

చిత్రం..ఒంటిపై కిరోసిన్ పోసుకున్న లోకెటి అనిత