తెలంగాణ

సైనికులకు డబుల్ పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: సైనికులుగా పని చేసి రిటైర్ అయిన తరువాత డబుల్ పెన్షన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైనికులుగా పని చేసి రిటైర్ అయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరి రిటైర్ అయిన తరువాత వారికి ఏదో ఒక పెన్షన్ మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. మిలట్రీ నుంచి, సివిల్ విభాగం నుంచి పెన్షన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డబుల్ పెన్షన్‌కు అవకావం కల్పిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల హామీ ఇచ్చారు. దాంతో సోమవారం దీనికి సంబంధించి జివో విడుదల చేశారు.