తెలంగాణ

విద్యార్థిని ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 16: తరగతి గదిలో అందరి ముందు కొట్టడం వల్లే మనస్తాపానికి గురైన ఎర్రోళ్ల భవాని ఆత్మహత్య చేసుకుందని ఏసిపి నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన కళాశాల ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విలేకర్లతో ఆయన కేసు వివరాలు చెప్పారు.ఈనెల 5న భవాని తోటి విద్యార్థి నుంచి 100 రూపాయలు చోరీ చేసిందని అనుమానించి తరగతి గదిలో అందరి సమక్షంలో ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి చేయిచేసుకున్నారని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన భవాని కళాశాల భవనం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కళాశాల యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులను నమ్మబలికి తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. ఈ విషయంలో విద్యార్థి సంఘాలు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం ముందు ఆందోళన చేశాయి. విద్యార్థిని మృతికి కారణమైన ప్రిన్సిపాల్ పై చర్య తీసుకొని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఈకేసుపై ఏసిపి నర్సింహారెడ్డి కళాశాల విద్యార్థులు, విద్యార్థిని సోదరి శివానీలను విచారించారు. కళాశాలలోని సిసి కెమెరా పుటేజ్‌లను పరిశీలించారు. ప్రిన్సిపాల్ చేయి చేసుకోవడం వల్లే భవాని ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చారు. ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావదన్నారు. విద్యార్థుల పట్ల బోధనాసిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో సిఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.