తెలంగాణ

ఇద్దరూ కారెక్కేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ టిడిపికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార టిఆర్‌ఎస్ గూటికి చేరిపోయారు. టిడిపికి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇద్దరూ తమను టిఆర్‌ఎస్ శాసనసభ పక్షం సభ్యులుగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ మధుసూదనాచారికి బుధవారం అధికారికంగా లేఖ పంపించారు. వీరిద్దరు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును గత రెండు రోజులుగా విడివిడిగా కలిసిన అనంతరం టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ముఖ్యమంత్రిని సోమవారం కలువగా, మరో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మంగళవారం ఆయన్ని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా వీరు ఇద్దరు ఎమ్మెల్యేలు తమను టిఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తించాలని వీరు స్పీకర్‌కు లేఖ రాయడంతో అధికార పార్టీలో చేరిన టిడిపి ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరింది. ఇప్పటికే టిడిపి శాసనసభా పక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సహా 10 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో టిటిడిపి నుంచి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, తాజాగా టిఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలతో వీరి సంఖ్య 12కు చేరింది. ఇంకా పార్టీలో మిగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే. వీరిలో మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రంగారెడ్డి జిల్లా ఎల్‌బినగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఉన్నారు. టిటిడిపి నుంచి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలలో సండ్ర వెంకట వీరయ్య కూడా రేపో,మాపో టిఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం అయినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.