తెలంగాణ

కొత్త కలెక్టరేట్‌లకు భూములు గుర్తించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: కొత్త జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాల్లో సమీకృత భవన సముదాయాలను నిర్మించనున్నట్టు చెప్పారు. కలెక్టరేట్ భవన సముదాయాలకు, జిల్లా పోలీస్ సూపరిండెంట్ కార్యాలయ నిర్మాణం, సిబ్బంది వసతికి కావలసిన భూములను జిల్లా కేంద్రాల్లో గుర్తించాలని సూచించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరగా పంపించాలని, ఈ భవనాలు గ్రీన్ బిల్డింగ్స్‌గా ఉండాలని అన్నారు. హరిత హారం కింద నిర్దేశించిన మేరకు మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. మొక్కల సంరక్షణకు సంబంధించి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పదిహేనురోజుల లోగా వేతనాలు చెల్లించాలని చెప్పారు. వేతనాల చెల్లింపులో వరంగల్ 88శాతం పూర్తి చేసి మొదటి స్థానంలో ఉందని, మహబూబ్‌నగర్ 82శాతం పూర్తి చేసిందని రెండు జిల్లాల కలెక్టర్లను అభినందించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలని చెప్పారు. హాస్టళ్లను అభివృద్ధి చేసేందుకు 15 రోజుల్లో నివేదిక పంపించాలని కోరారు. అసైన్డ్ భూముల వివరాలు అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మిషన్ భగీరథ పనులు ఏ విధంగా సాగుతున్నాయో జిల్లాల వారిగా అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని, ఇంటింటికి మంచినీటిని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. నిధుల సమస్య లేదని, పనులు చురుగ్గా సాగేట్టు చూడాలని అన్నారు.