తెలంగాణ

ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి/పాన్‌గల్, జనవరి 17: వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోగల బొల్లిగట్టుచెరువు మలుపువద్ద మంగళవారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలైనట్లు పాన్‌గల్ ఎఎస్సై చంద్రారెడ్డి తెలిపారు. కొల్లాపూర్ మండలం సింగవట్నం గ్రామంలోని శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో జరిగే ఉత్సవాల్లో (జాతర) భాగంగా మొదటిరోజైన మంగళవారం రథోత్సవం (తేరు) జరుగుతుండగా ఆ కార్యక్రమానికి వెళ్లి వస్తూ ట్రాక్టర్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. అలంపూర్ తాలూకా తక్కశిల గ్రామానికి చెందిన ఒక కుటుంబం వారి బంధువులతో కలిసి ఒక ట్రాక్టర్‌పై 25 మంది బయలుదేరి శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకొని తేరు లాగిన అనంతరం తిరిగివస్తున్నారు. మార్గమధ్యంలో మలుపు గమనించని డ్రైవర్ వేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా నన్మూరు గ్రామానికి చెందిన తిరుపతమ్మ (60), ఉండవల్లి గ్రామానికి చెందిన స్వాతి (25), కర్నూలు జిల్లా కొడుమూరు తాలూకా తాలకుర్తి గ్రామానికి చెందిన కిరణ్ (10), నందికొట్కూరు తాలూకా నాగటూరు గ్రామానికి చెందిన 10 నెలల యోగేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలుకాగా అందులో కొందరికి సీరియస్‌గా ఉన్నట్లు ఎఎస్సై తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు జరిపి తీవ్రగాయాలైన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.