తెలంగాణ

మాస్ కాపీయింగ్‌పై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: పది, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై అఫిటవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఈ పరీక్షలను పటిష్ఠంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ ఏలూరుకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అఫిడవిట్‌లను దాఖలుచేశారు. కాగా 2016 మార్చి నెలలో పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందని , ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయని హైకోర్టు పేర్కొంది.

ప్రత్యామ్నాయ పార్టీ అవసరం
యోగేంద్ర యాదవ్ పిలుపు
హైదరాబాద్, జనవరి 17: ప్రజల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటు అత్యవసరమని స్వరాజ్ ఇండియా పార్టీ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ అడ్వకేట్ జెఎసి ఆధ్వర్యంలో ‘ప్రత్యామ్నాయ రాజకీయాలు’ అనే అంశంపై ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగేంద్ర యాదవ్, టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హాజరై మాట్లాడారు. దేశంలోని అన్ని పార్టీలు యంత్రాలుగా మారాయని, రాజనీతిలో నీతి కరువయిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడ్డ పార్టీలు, సంస్థలు కుటుంబ ఆస్తులుగా మారిపోవడం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. పాలకులు మారుతున్నా ప్రజల స్థితిగతుల్లో మార్పు రాకపోవడానికి కారణం గద్దెనెక్కిన వారు సంకుచితంగా ఆలోచించడం, స్వార్ధం కోసం పనిచేయడమేనని అన్నారు. అలాంటి రాజకీయాలకు స్వస్తి పలికి శుద్దమైన రాజకీయాలను తీసుకురావాలని, దీనికి ప్రజలే ముందుకు రావాల్సి ఉంటుందన్నారు. గత 15 ఏళ్లలో ఏర్పడ్డ రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ ఏర్పాటు ఎంతో కష్టంగా ఏర్పడిందన్నారు.