బిజినెస్

నష్టాల్లో ఉల్లి రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: ఉల్లి రైతులు నష్టాలబారినపడ్డారు. గిట్టు బాటు ధరలేక కుదేలైపోయారు. కృష్టా జిల్లా పెనుమాక, ఉండవల్లి ప్రాంతాల్లోని ఉల్లి రైతులు ఈ ఏడాది నష్టాలను చవిచూస్తుండగా, పెరిగిన పెట్టుబడులు, సరైన ధర లేక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. అమరావతి రాజధాని పరిధిలో భూ సమీకరణకు ప్రతిపాదించిన గ్రామాలైన పెనుమాక, ఉండవల్లి ప్రాంతాల్లో దాదాపు 1.000 ఎకరాల్లో ఉల్లి పంట పండిస్తున్నారు. నిజానికి గతంలో దాదాపు 5 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేసేవారు. కానీ భూ సమీకరణ ఇతర అంశాల కారణంగా ప్రస్తుతం గణనీయంగా పడిపోయింది. కాగా, ధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదని, ఎకరాకు సంవత్సరానికి దాదాపు లక్ష రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కోడిపేను, ఎర్రనల్లి తెగుళ్లు ఎక్కువగా ఉండటంతో తరచూ పురుగు మందులను పిచికారీ చేయాల్సి వస్తోందని, పురుగు మందులు కొనుగోలు, చల్లడం కూడా ఖరీదైన వ్యవహారంగా మారిందని రైతులు చెబుతున్నారు. కౌలుకు 20 వేల రూపాయలు, నార కొనుగోలుకు 15 వేల రూపాయలు, కూలికి మరో 5 వేల రూపాయలు ఖర్చు అవుతోంది. కూలీల లభ్యత తక్కువగా ఉండటంతో ఎక్కువ కూలి చెల్లించిమరి పని చేయించుకోవాల్సి వస్తోంది. చేనులో ఏ పని చేయాలన్నా కూలీల కొరత సమస్యగా మారిందని రైతులు అంటున్నారు. కష్టపడి పంట పండించినా, గిట్టుబాటు ధర లేక నష్టాలను మూటగట్టుకుంటున్నామని పేర్కొంటున్నారు. కాగా, ఉల్లి పంటను కళ్లాల్లోనే కిలో 5 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. నిరుడు డిసెంబర్ 31న మాత్రం 7 రూపాయల చొప్పున విక్రయించారు. మార్కెట్‌లో కిలో 13 రూపాయల వరకూ విక్రయిస్తున్నా, రైతులకు మాత్రం నామమాత్రంగానే ధర లభిస్తోంది. పొలం వద్దే విక్రయించినా ఎకరాకు 40 వేల వరకూ నష్టం వాటిల్లుతోందని, ఇక మార్కెట్లకు తరలిస్తే నష్టాలు పెరుగుతున్నాయని అంటున్నారు. గతంలో ఉల్లిని ఎగుమతి చేసేందుకు వీలుండేది. కానీ ప్రస్తుతం ఎగుమతులపై నిషేధం విధించి, స్థానిక మార్కెట్లలోనే విక్రయించాలని అధికారులు ఆదేశాలివ్వడంతో రైతు తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగుమతులకు అవకాశం కల్పిస్తే, కిలో 15 రూపాయల మేర విక్రయించే అవకాశం ఉండేదని ఒక రైతు తెలిపారు. కృష్టా, గుంటూరు జిల్లాలకు ఉల్లిని సరఫరా చేసే ఈ ప్రాంత రైతులు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

17 సర్కిళ్లలో వొడాఫోన్ ‘సూపర్‌నెట్ 4జి’
న్యూఢిల్లీ, జనవరి 18: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ వొడాఫోన్.. దేశవ్యాప్తంగా 17 సర్కిళ్లలో ‘సూపర్‌నెట్ 4జి’ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు బుధవారం తెలియజేసింది. ఈ ఏడాది మార్చికల్లా 2,400 పట్టణాలకు ఈ సేవలను విస్తరిస్తామని పేర్కొంది. ప్రస్తుతం కేరళ, కర్నాటక, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబయి, హర్యానా, ఉత్తరప్రదేశ్ (తూర్పు), గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, అస్సోమ్, ఈశాన్య, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ (పశ్చిమ), ఒడిషా, పంజాబ్ సర్కిళ్ల వినియోగదారులు ‘సూపర్‌నెట్ 4జి’ సేవలను అందుకోవచ్చంది. వీడియోకాల్స్, లైవ్ టెలివిజన్, హెచ్‌డి సేవలు పొందవచ్చంది.

ఆటోమొబైల్ టెలీమాటిక్స్‌లోకి రిలయన్స్ జియో
న్యూఢిల్లీ, జనవరి 18: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. ఆటోమొబైల్ టెలీమాటిక్స్ విభాగంలోకి అడుగు పెట్టనుంది. మొబైల్ యాప్ ద్వారా వాహన కదలికలను నియంత్రించే, ఇంధనం, బ్యాటరీలకు సంబంధించి యజమానులను అప్రమత్తం చేసే ఓ పరికరంతో ఆటోమొబైల్ టెలీమాటిక్స్ రంగంలోకి జియో ప్రవేశించనుంది. ఈ పరికరం.. వాహనాలకు వైఫై సౌకర్యాన్ని కల్పిస్తుందని, ముఖ్యంగా దొంగిలించబడిన సమయంలో కారు కదలికలను, అది ఎక్కడుందనే సమాచారాన్ని యజమానులకు తెలియజేస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.