రాష్ట్రీయం

ఉభయ సభలూ నిరవధిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: శాసనమండలి, శాసనసభ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. శాసనమండలి చైర్మన్ కె స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి బుధవారం సభలను నిరవధికంగా వాయిదా వేశారు. గత నెల 16న ఉభయ సభలూ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శీతాకాల సమావేశాలు సాధారణంగా వారం పది రోజులకు మించి జరగవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎప్పుడూ జరగని విధంగా ఈ దఫా శీతాకాల సమావేశాలు 18 రోజుల పాటు (పని దినాలు) జరిగాయి.
18 రోజుల్లో శాసనసభ 94 గంటల 56 నిమిషాల పాటు జరిగింది. నక్షత్రపు గుర్తుగల 110 ప్రశ్నలకు, నక్షత్రపు గుర్తులేని 45 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. ఇందులో 361 ఉప ప్రశ్నల8కూ సమాధానాలిచ్చారు. నాలుగు అంశాలపై మంత్రులు ప్రకటనలు చేయడం, స్వల్ప వ్యవధి ప్రశ్న కింద 15 అంశాలపై చర్చ జరిగింది. 16 బిల్లులను ప్రతిపాదించి ప్రభుత్వం ఆమోదింపజేసుకున్నది.
పార్టీల బలాబలాలు
శాసనసభలో సభ్యుల బలబలాలను స్పీకర్ వెల్లడించారు. తెరాస 82, కాంగ్రెస్ 19, మజ్లిస్ 7, బిజెపి 5, తెలుగు దేశం 3, సిపిఐ 1, సిపిఎం 1, స్వతంత్ర ఎమ్మెల్యే 1, నామినేటెడ్ 1 కలిపి మొత్తం సభ్యుల సంఖ్య 120.