తెలంగాణ

వౌలిక సదుపాయాలకు ఇర్కాన్ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగర వౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇర్కాన్ ముందుకొచ్చింది. క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇర్కాన్ సిఎండి మోహన్ తివారీ, అడిషనల్ జనరల్ మేనేజర్ దొడ్డయ్యతో పాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రహదారులు, ఇతర వౌలిక సదుపాయాల కల్పనలో తాము భాగస్వామ్యం అవుతామని వారు సంసిద్ధతను వ్యక్తం చేశారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి వివరించారు. రైల్వే స్టేషన్లతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టిన అనుభవం కలిగిన తాము హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతామని ఇర్కాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.