తెలంగాణ

భూసేకరణ బాధ్యత జిల్లా కలెక్టర్లదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: భూసేకరణకు సంబంధించి 2013 చట్టానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన సవరణలు చెల్లవంటూ ఉన్నత న్యాయస్థానం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూల్స్‌ను రూపొందించింది. ‘తెలంగాణ స్టేట్ రైట్ టు ఫెయిర్ కంపెనే్సషన్ రూల్స్, 2014’గా దీన్ని పేర్కొన్నారు. ఈమేరకు ఉత్తర్వులు (జీఓఎంఎస్ 6) జారీ అయ్యాయి. జీఓ మంగళవారమే విడుదల చేసినట్టు ప్రకటించినప్పటికీ, దీన్ని బుధవారమే ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.
తాజా రూల్స్ ప్రకారం ప్రజల అవసరం కోసం భూమి ఎవరి అధీనంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టారు. భూసేకరణ కోసం కలెక్టర్లను ‘అప్రాప్రియేట్ గవర్నమెంట్’గా పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఆయా జిల్లాల పరిధిలో ఉండే భూమి ఎంత విస్తీర్ణమైనప్పటికీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు కల్పించారు. ఈమేరకు రెవెన్యూ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ ఎంజి గోపాల్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.