తెలంగాణ

రెండో అధికార భాషగా ఉర్దూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్దూను అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చేందుకు చర్యలు చేపడతామని సిఎం తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ముస్లిం-మైనారిటీల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానమిస్తూ రాష్ట్రంలోని ముస్లిం పాఠశాలలకు కేంద్రం 75 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. కెజి నుంచి పిజి పథకంలో భాగంగా 200 పాఠశాలలు ప్రారంభించామన్నారు. కరీంనగర్‌లో 10 ఎకరాలు వక్ఫ్ భూమి కబ్జాకు గురైనట్లు కాంగ్రెస్ సభ్యుడు టి. జీవన్‌రెడ్డి తమ దృష్టికి తీసుకుని వచ్చారని, ఇందులో ఎంతపెద్ద వారున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ భూమిని వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. వౌజం, ఇమాంలకు ప్రస్తుతం చెల్లిస్తున్న వెయ్యి రూపాయల భృతిని 1500 రూపాయలకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
‘నీట్’ను ఉర్దూలో రాసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టిలతో సమానంగా ముస్లిం రైతులకూ సబ్సిడీ వంటి బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. హుస్సేనీ షావలి దర్గా స్థల ఆక్రమణపై సభా సంఘంతో విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. యుపిఎ-1 అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గ సమావేశంలో తానే ముస్లిం, మైనారిటీల స్థితిగతులపై ప్రస్తావించినందుకే జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.
తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని కెసిఆర్ ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చి, పార్లమెంట్ ఆమోదం ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చిన విధంగా రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచుతామన్నారు. రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేసుకునే సౌలభ్యాన్ని పొందేందుకు వీలుగా బిల్లును రాష్టప్రతి ఆమోదానికి పంపిస్తామన్నారు. ముస్లిం పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ‘టిఎస్ ప్రైమ్’ అనే పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెడుతామని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 71 మైనారిటీ గురుకుల విద్యాసంస్థలు ఉన్నాయని, వీటిని 200కు పెంచి వాటిలో సగం పాఠశాలలను బాలికలకు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్‌లో ‘ఓన్ యువర్ ఆటో’ పథకం కింద 1783 మంది మైనారిటీలకు ఇచ్చే సబ్సిడీని 80 శాతానికి పెంచామన్నారు. మైనారిటీ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇస్తున్నామన్నారు. ‘అనీస్-ఉల్-గుర్బా’ ముస్లిం అనాథ శరణాలయాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సంస్థకు నాంపల్లిలో 4000 చదరపు గజాల భూమి కేటాయించి, బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. హజ్ యాత్రికుల కోసం రెండుకోట్ల రూపాయలు గ్రాంట్‌గా ఇచ్చామన్నారు. రాజస్థాన్‌లో అజ్మీర్ దర్గా వద్ద ‘రుబాత్’ పేరుతో తెలంగాణ యాత్రికుల కోసం వసతి గృహానికి రూ.5 కోట్లు కేయించామన్నారు. రాష్ట్రంలో 14.24 శాతం ఉన్న మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం సమగ్ర కార్యాచరణను రూపొందించి తొలి బడ్జెట్‌లోనే రూ.1030 కోట్లు కేటాయించగా,. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1204 కోట్లకు పెంచామన్నారు. మైనార్టీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకానికి ఇచ్చే మొత్తాన్ని రూ. 20 లక్షలకు పెంచామన్నారు.