తెలంగాణ

మాటల యుద్ధం మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 18 రోజుల పాటు ప్రశాంతంగా జరిగాయి. అధికార విపక్షాలు చర్చలకే ప్రాధాన్యత ఇచ్చారు. పెద్దగా రాజకీయ విమర్శలు లేకుండా చర్చించే అంశాలకే పరిమితం అయ్యారు. విపక్షం సైతం నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకే ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇదే మాట చెప్పారు. సమావేశాలు ప్రశాంతంగా జరిగినా, సభ ముగిసిన మరుసటి రోజే అధికార పక్షం, విపక్షాలు తీవ్ర స్థాయిలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. విపక్షానికి మాట్లాడేందుకు అవకాశాలు ఇవ్వలేదని, సభ తీరు పట్ల కాంగ్రెస్ సభ్యురాలు డికె అరుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కెసిఆర్ కుటుంబం కనుసన్నల్లో సభ నడిచిందని టిడిపి సభ్యులు రేవంత్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేక మిన్నకుండి పోయిన విపక్ష సభ్యులు, సభ ముగిసిన తరువాత అర్ధం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని అధికార పక్షం విమర్శించింది. రేవంత్‌రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన మాటలను పట్టించుకోదలుచుకోలేదని టిఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. విపక్షాలు అడిగిన ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. ప్రతిపక్షం నుంచి అధికార పక్షం అభినందనలు అందుకున్న సభ ఇదేనని అని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.