తెలంగాణ

క్యాట్‌లో ఏకె ఖాన్ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మతో సమానంగా తనకు పెన్షన్ బెనిఫిట్లను ఖరారు చేసి చెల్లించాలని కోరుతూ ఏసిబి పూర్వ డిజి ఎకె ఖాన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన క్యాట్ కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి, డిజిపి అనురాగ్ శర్మకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు ట్రిబ్యునల్ సభ్యుడు జెకె శ్రీవాత్సవ పేర్కొన్నారు. తన కంటే డిజిపి అనురాగ్ శర్మ ఒక ఏడాది జూనియర్ అని ఎకె ఖాన్ తెలిపారు. తాను సీనియర్ అయినా డిజిపి అనురాగ్ శర్మ కంటే తక్కువ వేతనాన్ని తీసుకున్నానన్నారు. తన క్లయింట్‌కు డిజిపి హోదాను కల్పించలేదని, అలాగే వేతనం కూడా డిజిపి కంటే తక్కువ చెల్లించారని న్యాయవాది మహమ్మద్ షఫీక్యుజామాన్ తెలిపారు. రాష్ట్రప్రభుత్వానికి ఈ విషయాన్ని ఎకె ఖాన్ నివేదించారన్నారు. అనంతరం క్యాట్ ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.