తెలంగాణ

కొత్త ఒరవడి సృష్టించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: అసెంబ్లీ సమావేశాల నిర్వాహణలో ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త ఒరవడి సృష్టించారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు వేరువేరుగా జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఉభయ సభలు జరిగిన తీరు మేలు కలిగించే విధంగా ఉన్నాయని ప్రజలు భావిస్తుంటే , ప్రతిపక్షాలకు మాత్రం తీవ్ర నిరాశ కలిగించాయని శాసన మండలిలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో రాజేశ్వర్‌రావు మాట్లాడారు. శీతాకాల సమావేశాలు 18 రోజుల పాటు జరగడం విశేషమని, దేశంలో ఎక్కడా ఇన్ని రోజులు జరపలేదని అన్నారు. అన్ని రంగాల సంక్షేమానికి తీసుకునే చర్యలను సభలో ముఖ్యమంత్రి వివరించారని అన్నారు. ముస్లింలలోని పేదలకు 12శాతం రిజర్వేషన్లను సాధించి తీరుతామనే నమ్మకం కలిగించారని అన్నారు. ఉభయ సభలు జరిగిన తీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి తుపాకీ రాముడని, పిట్టల దొర అని, రాజకీయ పరిపక్వత లేదని, చిల్లర మల్లరగా టిఆర్‌ఎస్ పట్టించుకోదని అన్నారు.
వనె్న తెచ్చాయి
శీతాకాల సమావేశాలు ప్రజాస్వామ్యానికే వనె్న తెచ్చే విధంగా సాగాయని ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, సలీం, శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కనీసం పది రోజులు సమావేశాలు నిర్వహించాలని విపక్షం కోరితే మూడు రోజుల పాటు జరిపి ముగించారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలకు అజెండా లేకుండా పోయిందని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి అప్పుడు నిజాం కృషి చేస్తే, ఇప్పుడు కెసిఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ సలీం తెలిపారు. 12 శాతం రిజర్వేషన్లను కెసిఆర్ సాధించి చూపిస్తారని అన్నారు.