తెలంగాణ

తెలంగాణ సంస్కృతి నచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జనవరి 19: తెలంగాణ సంస్కృతి చాలా బాగుందని లండన్‌కు చెందిన విద్యార్థులు అన్నారు. లండన్‌కు చెందిన టీచర్ జోన, స్ట్ఫా నర్స్ శారా, విద్యార్థులు శ్రాచ్, లో, డానియల్, లిండసే మెదక్‌లో నడుస్తున్న రిస్క్ పింక్ ఐసియం సెంటర్‌కు వచ్చారు. మెదక్ జిల్లా శమ్నాపురం గ్రామంలో వీరు గురువారం పర్యటించారు. మహిళల కట్టూబొట్టు, వారి పనులు బాగా నచ్చాయని ఆ విద్యార్థులు తెలిపారు. రిస్క్ పింక్ సెంటర్‌లో ఉంటున్న 33 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ తరగతులను వారు నిర్వహించారు. అంతే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఎలాంటి పనులను నిర్వహించాలనే దానిపై తరగతులను నిర్వహించారు. పరిశుభ్రత విషయంలో ఏం చేయాలో వివరించారు. పౌష్టికాహారం ఎలా, ఎందుకు తీసుకోవాలో విద్యార్థినులకు బోధించారు. గురువారం సాయంత్రం మెదక్ పట్టణంలో ఉన్న సాయిదీప్ సూపర్‌స్టోర్స్‌కు స్టాప్ నర్సు, ఒక టీచర్, రిస్క్ పింక్ సెంటర్ టీచర్ సంగీత వచ్చారు. అక్కడ స్నాక్స్ తీసుకుంటుండగా ఆంధ్రభూమితో మాట్లాడారు. ‘ఇక్కడి ప్రజలు మంచివారు, మాకెంతో నచ్చారు. మహిళల కట్టుబొట్టు నచ్చింది, మంచి మర్యాదస్తులు, పలకరింపుబాగుంది, సంస్కృతి నచ్చింది, తెలంగాణ భాష బాగా నచ్చింది. ఇక్కడ పరిపాలన కూడా చక్కగా ఉంద’ని వారు కొనియాడారు. మరో వారం రోజుల పాటు మెదక్ రిస్క్ పింక్ సెంటర్‌లో ఉంటూ గ్రామాలను పర్యటించి విద్యపై సర్వే చేస్తామని వారు తెలిపారు.

చిత్రం..సూపర్‌స్టోర్‌లో స్నాక్స్ కొంటున్న లండన్‌కు చెందిన టీచర్, స్టాప్ నర్సు, విద్యార్థులు