తెలంగాణ

ఐదు లక్షలు ఇచ్చుకో.. ప్రమోషన్ పుచ్చుకో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జనవరి 19: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగుల పదోన్నతులలో భారీ గోల్ మాల్ జరిగింది. అంగన్‌వాడీ ఏసిడిపివో పదోన్నతులలో నిబంధనలను తుంగలో తొక్కిన ఓ ఉన్నతాధికారి కోటిన్నర పైచిలుకు మొత్తం దండుకుని 36 మంది జూనియర్లకు అడ్డదారుల్లో ఏసిడిపివో పదోన్నతులు కల్పించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరి వద్ద ఐదు లక్షల చొప్పున మొత్తం కోటిన్నర పైచిలుకు దండుకున్నట్లు ఆశాఖలోని ఉద్యోగులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్లను పక్కనబెట్టి అడ్డదారుల్లో జూనియర్లకు పదోన్నతి కల్పించిన వ్యవహారంలో ఆశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హైద్రాబాద్‌లోని ఆశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు కర్త, కర్మ, క్రియ అన్నీ తామే అన్నట్లు వ్యవహరించి ఈతతంగాన్ని నడిపినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో జరిగిన అతిపెద్ద పదోన్నతుల కుంభకోణం ఈఘటనతో వెలుగు చూసింది. మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 149 సమగ్ర స్ర్తి, శిశు సంక్షేమ సేవా పథకం ప్రాజెక్టులు (ఐసిడిఎస్)లు ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టులో ఒక సిడిపివో, మరొక ఏసిడిపివో, అంగన్‌వాడీ కేంద్రాల సంఖ్యను బట్టి సూపర్ వైజర్లు ఉంటారు. సూపర్ వైజర్లు (పర్యవేక్షకులు) వారి సీనియార్టి ప్రకా రం గ్రేడ్ -1, గ్రేడ్ -2లుగా విధు లు నిర్వహిస్తున్నారు. ఈ సూపర్‌వైజర్లు నిత్యం అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తారు. అయితే 1997వ సంవత్సరంలో 130 మందిని గ్రేడ్ టూ సూపర్‌వైజర్లుగా ప్రభుత్వం నియమించింది. ఈ 130 సూపర్‌వైజర్లకు తిరిగి 2012 అక్టోబర్ 10న గ్రేడ్ టూ సూపర్‌వైజర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అయితే వీరిలో ఏడుగురికి 2016 ఏప్రిల్ మాసంలో సిడిపివో పదోన్నతి కల్పించింది. అనంతరం 2016 నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా సీనియార్టీ జాబితాను ఉన్నతాధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఇదే జాబితాను ఆన్‌లైన్‌లో సైతం ఉంచారు. ఇవో పరీక్షతో పాటు డిపార్టుమెంట్‌ల్ పరీక్షలో సైతం ఉత్తీర్ణత సాధించారు. అయితే రెండు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుం డా 36 మంది జూనియర్లకు ఏసిడిపివో పదోన్నతి కల్పిస్తూ వ్యక్తిగత ఉత్తర్వు కాపీలను కొందరికి డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరు అందజేసినట్లు తెలియవచ్చింది. మరికొందరికి వారి ఇళ్లకు పోస్టు ద్వారా పంపించారు. దీంతో సీనియర్లు నివ్వెరపోయారు. సీనియార్టీ జాబితా ప్రకారం తమకు కాకుండా తమ కింద స్థానంలో ఉన్న వారికి ఏసిడిపివో పదోన్నతులు కల్పించడంతో విస్తుపోయారు. దీనిపై ఉన్నతాధికారులను సంప్రదిస్తే డిగ్రీ ఉండాలని చెబుతున్నారని వాపోయారు. ఇదే సమయంలో పారదర్శకంగా ఏసిడిపివో పదోన్నతులు కల్పిస్తే ఎందుకు ఆన్‌లైన్‌లో పెట్టలేదని ప్రశ్నించగా అధికారుల నుండి సమాధానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ జీవోలో కూడా డిగ్రీ అర్హత ఉండాలన్న నిబంధన లేదని, గత ఏడాది ఏప్రిల్ మాసంలో పదవ తరగతి అర్హత ఉన్నవారికి సైతం ఏకంగా సిడిపివో పదోన్నత కల్పించారని పేరు చెప్పేందుకు నిరాకరించిన కొంత మంది బాధిత సూపర్‌వైజర్లు వాపోయారు.
మొత్తం మీద దీనికి వెనుక భారీ తతంగమే జరిగింది. మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు తెలియకుండా ఓ అధికారి అడ్డదారుల్లో పదోన్నతులు కల్పించారనే విమర్శలు వెల్లువెత్తాయి. హైద్రాబాద్‌లో పనిచేస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి సదరు అధికారిని మచ్చిక చేసుకుని భారీగా డబ్బులు దండుకుని ఈ తతంగాన్ని నడిపినట్లు తెలియవచ్చింది. అన్యా యం జరిగిన బాధిత సీనియర్ సూపర్ వైజర్లు కోర్టు ఆశ్రయించనున్నట్లు సమాచారం.