తెలంగాణ

తెలంగాణలో విస్తరిస్తున్న బ్రెయిన్ టిబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: భారతదేశంలో క్షయ మళ్లీ విస్తరిస్తోందని, ఏటా మూడు మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయని, తెలంగాణలో బ్రెయిన్ టిబి కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోందని హైదరాబాద్‌కు చెందిన హెల్పింగ్ హాండ్ ఫౌండేషన్ పేర్కొంది. బ్రెయిన్ ట్యూబర్‌క్యులోసిస్ (టిపి)పై తెలంగాణలో క్షేత్రస్ధాయిలో ఈ సంస్థ అధ్యయనం చేపట్టింది. 2016 మొదటి 11 నెలల్లో రాష్ట్రంలో ఐదు వందలకు పైగా బ్రెయిన్ టిబి కేసులు నమోదైనట్లు ఆ సంస్ధ ఫౌండర్ ట్రస్టీ హసన్ అక్సారీ తెలిపారు.
తమ సర్వేలో అనేకమంది న్యూరాలజిస్టులు పాల్గొన్నారని తెలిపారు. కేంద్రనాడీ మండలంపై ఏర్పడే పల్చటి పొరకు మైక్రో బాక్టీరియం ట్యూబర్‌క్లోసిన్ ఇన్‌ఫెక్షన్ ఏర్పడటాన్ని బ్రెయిన్ టిబి లేదా టిబిఎంగా పరిగణిస్తారని చెప్పారు. నాడీ మండలానికి ఇతర రకాలైన వైరల్ ఫంగల్ ఏర్పడవచ్చని, తెలంగాణలో 11 నెలల్లో 442 కేసులు నమోదయ్యాయని, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 199, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 243 కేసులు వచ్చాయని చెప్పారు. వీరిలో పురుషులు 232, మహిళలు 210 మంది ఉన్నారని, 15 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు కలిగిన రోగులు 96, 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న వారు 141 మంది , 30 ఏళ్లకు పైబడిన వారు 205 మంది ఉన్నారని చెప్పారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో 50 శాతం మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లోచికిత్స తీసుకునేందుకు ఆసక్తిని కనపరిచారని, రోగులకు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చయిందని సర్వేలో తేలింది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల వ్యాధి తీవ్రతను తగ్గించి దీర్ఘకాలం జీవించవచ్చన్నారు. మెట్రో నగరాల్లో టిబి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచబ్యాంకు పేర్కొన్న విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది.