తెలంగాణ

జిఎస్‌టికి సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 19: ద్వంద్వ పన్ను విధానాన్ని నియంత్రిస్తు కేంద్రం ప్రతిపాదిస్తున్న నూతన వస్తు, సేవాపన్ను (ఐజిఎస్‌టి) పరిధిలోకి తెలంగాణ జిల్లాలు వడివడిగా ముందడుగు వేస్తున్నాయి. హైద్రాబాద్, రంగారెడ్డి మినహా ఇతర తెలంగాణ జిల్లాలు ఎక్కువగా గ్రామీణ నేపథ్యంతో ఉన్నప్పటికి జిఎస్‌టి పన్ను విధానంలో వ్యాపారులు, డీలర్లు వేగంగా నమోదు ప్రక్రియను పూర్తి చేస్తుండటం ఆసక్తికరం. ఏప్రిల్ 1నుండి జిఎస్‌టి చట్టాన్ని అమల్లోకి తేవాలని ప్రయత్నించినా కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్నుల వాటా, ద్వంద్వ పర్యవేక్షణ, శ్లాబ్‌ల నిర్ధారణ దిశగా మరింత కసరత్తు జరగాల్సిన నేపధ్యంలో జూలై 1వ తేది నుండి జిఎస్‌టి చట్టాన్ని అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని పన్ను చెల్లింపు దారులైన వ్యాపారులను, డీలర్లను వ్యాట్ నుండి జిఎస్‌టిఎన్ పన్ను విధానంలోకి బదలాయించే ఆన్‌లైన్ ప్రక్రియ 90శాతానికి చేరింది. 20 లక్షలకుపైగా వార్షిక టర్నోవర్ సాగించే పన్ను చెల్లింపుదారులను వ్యాట్ నుండి జిఎస్‌టి పన్ను విధానంలోకి బదలాయిస్తున్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ల వాణిజ్య పన్నుల శాఖ డిసిటివో పరిధిలో రెండు జిల్లాలో 11,500మంది వ్యాపారులు, డీలర్లను జిఎస్‌టి పరిధిలోకి చేర్చాల్సివుంది. ఇందులో 10,354మందిని ఇప్పటికే జిఎస్‌టి పరిధిలో ఆన్‌లైన్ నమోదు పూర్తి చేశారు. జనవరి 1నుండి పక్షం రోజుల పాటు వ్యాట్ నుండి జిఎస్‌టిలోకి పన్నుచెల్లింపుదారుల బదలాయింపు ప్రక్రియకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రెండు జిల్లాల డిసిటివో పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, భువనగిరి, మహబూబ్‌నగర్, జడ్చర్ల, గద్వాల, ఎసి(ఎల్‌టియు) సర్కిల్‌లు ఉన్నాయి. రెండు జిల్లాల్లోని తొమ్మిది సర్కిళ్ల నుండి నెలకు గరిష్టంగా 60కోట్ల మేరకు వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం లభిస్తుంది. ఆరు చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఉన్న 6057మంది వ్యాపారులు, డీలర్లకుగాను 5415మందిని జిఎస్‌టి పరిధిలో నమోదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని సర్కిళ్లలో 5443మందికి 4,891మంది నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే ఈ-వాట్ పద్ధతిలో పన్ను చెల్లిస్తున్నందున జిఎస్‌టిలోకి బదలాయించడం సులభతరమైంది.