తెలంగాణ

మింగిన ప్రతి పైసా కక్కిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 19: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో కొందరు పందికొక్కుల్లా తయారై ప్రభుత్వ భూములు కబ్జాచేసి.. దొంగ రిజిస్ట్రేషన్లతో పరిహారం కాజేసేందుకు కుట్ర చేశారని, వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని, ప్రతిపైసా కక్కిస్తామని నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో గురువారం రాత్రి చేగుంట మండలానికి చెందిన సర్పంచులు మంత్రి హరీశ్‌రావు, ఎంపి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డిల సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు కడుతున్నామని అన్నారు. మల్లన్నసాగర్‌లో ఎవరు అక్రమాలకు పాల్పడ్డా సహించేది లేదని, వారెంతటివారైనా భరతం పడతామని హెచ్చరించారు. మల్లన్నసాగర్ అవినీతిపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోందని అన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రాజెక్టు కట్టి తీరుతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల కోసం ప్రజలు భూములిచ్చేందుకు, ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలే రెచ్చగొడుతూ అడ్డుపడుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేస్తు ప్రాజెక్టును ఆపేందుకు కుట్ర చేస్తున్నారని, ఎన్నికుట్రలు పన్నినా తాము ప్రాజెక్టు కట్టి తీరుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మంథనికి చెందిన రైతులు 123జిఓ కింద భూమి సేకరించాలని అసెంబ్లీకి వచ్చి కలిసి కోరారని అన్నారు. కాంగ్రెస్, టిడిపి నాయకులు భూసేకరణకు అడ్డుపడుతున్నారన్నారు. ప్రాజెక్టు కడితే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న దురాలోచనతోనే ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయన్నారు.
ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటా తాగునీరు అందించేందుకు కృషి చేస్తోందని, అర్హులకు డబుల్‌బెడ్‌రూంలు అందిస్తోందని అన్నారు. కాగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో 400మంది టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

చిత్రం..మంత్రి హరీశ్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరుతున్న చేగుంట నేతలు