తెలంగాణ

మానవ సహిత ఉపగ్రహాలు ప్రయోగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి మానవ సహిత ఉపగ్రహాల ప్రయోగంపై ఇస్రో దృష్టిని కేంద్రీకరించాలని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో రోదసీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై కొత్త కార్యక్రమాలు ఏమి చేపట్టారని ఆయన ప్రశ్నించారు. ఒక ప్రొగ్రాం ద్వారా 103 శాటిలైట్లను ప్రయోగించాలని ఇస్రో శాస్తవ్రేత్తలు ప్రయత్నిస్తున్నారని, దీని వల్ల సాధించేదేముందన్నారు. గురువారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలోనే బహుళ శాటిలైట్ ప్రయోగాలను చేసి భారత్ తన సత్తాను చాటుకుందని గుర్తుచేశారు. ఇస్రో తలపెట్టిన 103 శాటిలైట్ ప్రయోగాల్లో కొత్తదనం ఏముందన్నారు. 1500 కేజీల శాటిలైట్ పరిధిలో ఎన్ని ఉపగ్రహాలనైనా ప్రయోగించవచ్చన్నాని చెప్పారు. ‘ఈ రోజు విద్యార్ధులు మైక్రో, నానో శాటిలైట్లను తయారు చేసి ప్రయోగిస్తున్నారు. కిలోగ్రామ్‌లో ఫ్రాక్షన్ వంతు పదార్ధంతో కూడా నానో, మైక్రో శాటిలైట్‌లను ప్రయోగిస్తున్నారు. వచ్చే నెలలో ఇస్రో పిఎస్‌ఎల్‌వి మిషన్‌లోభాగంగా 103 శాటిలైట్లను ప్రయోగించనుంది. ఇదేమీ అద్భుతమైన రికార్డు కాదు’అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన హయాంలో 25 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన విషయం విదితమే. స్పేస్ టెక్నాలజీ ప్రాతిపదికగా సొసైటెల్ ప్రొగ్రాంను ఇస్రో చాలా సంవత్సరాల క్రితం రూపొందించిందని, దీనిని ఉపయోగించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ కూడా పేర్కొన్నారన్నారు. రోదసీ, అంతరిక్ష పరిశోధనల్లో భారత్ వెనకబడిపోయిందని ఆయన పేర్కొన్నారు.