తెలంగాణ

ఫ్లోరైడ్ గ్రామాలకు రూ.800 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు 800 కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు మిషన్ భగీరథ పథకం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలును పరిశీలించడానికి గురువారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంచినీటి సరఫరా, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ హామీ ఇచ్చారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచినీటితోపాటు ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసి తెలంగాణ పల్లెలకు మంచినీటి సమస్య నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. మంచినీటి పైపులతోపాటు ఇంటర్‌నెట్ కేబుల్ కూడా వేస్తున్నామన్నారు. శుద్ధిచేసిన మంచినీటివల్ల నీటి ద్వారా సంక్రమించే 70 శాతం వ్యాధులను దూరం చేయవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన శుద్ధి చేసిన మంచినీటి సరఫరా విధానం దేశంలోనే వినూత్నమైనదని పరమేశ్వరన్ ఈ సందర్భంగా కొనియాడారు. మిషన్ భగీరథ పథకాన్ని గజ్వేల్‌లో ప్రారంభించి వచ్చిన అనంతరం ఇదే విషయాన్ని తమకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారని పరమేశ్వరన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో గ్రామీణ నీటి సరఫరా కార్యాచరణను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వచ్చామని ఆయన వివరించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరు తెన్నులను కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నామన్నారు. మిషన్ భగీరథ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, ఈ పథకం పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలోని 1041 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన మంచినీటి అందించనుండటంతో కేంద్రం నుంచి రూ.800 కోట్ల నిధులను వెంటనే విడుదల చేస్తామని పరమేశ్వరన్ హామీ ఇచ్చారు. ఈ పథకం పూర్తి అయిన తర్వాత ప్రోత్సహకరంగా మరిన్ని నిధులను కూడా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
చైనా వియత్నాం, కెనడా వంటి దేశాలు కూడా నిర్దేశిత సమయంలో ఇంత పకడ్బందీగా మంచినీటి సరఫరా కోసం ప్రణాళికలను అమలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. మిషన్ భగీరధ పథకం పనుల పురోగతిని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.