తెలంగాణ

పశువుల కోసం సంచార వైద్యశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: రాష్ట్రంలో పశువుల వైద్యం కోసం వంద మొబైల్ వ్యాన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకాన్ని భారీ పరిశ్రమగా అభివృద్ధి చేయడానికి, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం తొలి సమావేశం గురువారం జరిగింది. అనంతరం పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మరో రెండు సమావేశాలు నిర్వహించిన తరువాత ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో పశు వైద్యం కోసం వంద మొబైల్ వ్యాన్‌లను ప్రారంభించనున్నట్టు చెప్పారు. చేపలకు సంబంధించి దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పిడి చట్టం ఉపయోగిస్తామని తలసాని తెలిపారు.
చేపల మార్కెట్‌పై ప్రణాళిక రూపొందించనున్నట్టు చెప్పారు. ప్రతి కుటుంబానికి లబ్ది కలిగే విధంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతోందని అన్నారు. ముదిరాజ్‌లు, గంగపుత్రులు, బెస్తలు, తెలుగు వారు, యాదవులు, కురుమలు, ఉప కులాల ఆర్థిక, సామాజిక సంక్షేమం కోసం బడ్జెట్‌లో వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టడం కోసం ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని తలసాని చెప్పారు. ప్రతి కుటుంబం ప్రయోజనం పొందాలని, సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని తలసాని అధికారులను ఆదేశించారు. సొసైటీలకు పావలా వడ్డీకే రుణం అందే విధంగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఫెడరేషన్ అధ్యక్షులు రాజయ్య యాదవ్, అధికారులు పాల్గొన్నారు.