తెలంగాణ

దసరా సందర్భంగా సినీ అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు దసరా పండుగ సందర్భంగా అవార్డులు ఇవ్వాలని, అయితే లోగడ ఇచ్చిన అవార్డుల పేరుతో కాకుండా కొత్త పేరుతో ఈ అవార్డులను ప్రదానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏప్రిల్‌లో కాకుండా దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేయాలని యోస్తున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఫిలిం కార్నివాల్ కోసం కొన్ని ఓపెన్ థియేటర్లను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. చిత్ర నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వడంతో పాటు తక్కువ బడ్జెట్ చిత్రాలను థియోటర్లలో 5వ ఆటగా ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించామని, ఫిలిం కార్నివాల్ చైర్మన్ సోహన్ రాయ్ సమర్పించిన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించి అమలుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రాలు నిర్మించడం ద్వారా పైరసీ అరికట్టవచ్చని, ఖైదీ నెం.150, గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు విడుదల కావడం ఈ ఏడాది చిత్ర రంగానికి శుభ పరిణామమని తలసాని అన్నారు.