తెలంగాణ

చీఫ్‌విప్, ఎంపి, ఎమ్మెల్సీలపై తేనెటీగల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్లపల్లి, జనవరి 20:వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్సీ నారదాసు సహా పలువురు నేతలపై తేనెటీగలు దాడి చేశాయి. అయితే వెంటనే పరిగెట్టి తప్పించుకోవడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఓ సీఐ, ఎస్‌ఐ మాత్రం తేనెటీగల దాడిలో స్వల్పంగా గాయపడ్డారు. గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్ శివారులోని మామిడి తోటలో భోజనాలకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. గొల్లపల్లిలో శుక్రవారం నాడు అండర్ 14 వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వీరితోపాటు మరికొంత మంది నాయకులు వచ్చారు. స్థానిక నేత సమీప మామిడి తోటలో విందు ఏర్పాటు చేయగా వారంతా అక్కడకు వెళ్లినపుడు ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టాయి. ఈ దాడిలో నాయకులంతా సురక్షితంగా తప్పించుకున్నప్పటికీ సిఐ శ్రీనివాస్, ఎస్సై ఉపేందర్‌చారి స్వల్పంగా గాయ పడ్డారు.