తెలంగాణ

కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం సంతకం చేశారు. ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ప్రస్తుతం ఉన్న వేతనాలను 50 శాతం పెంచనున్నారు. దీంతో ప్రస్తుతం డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు ఇస్తున్న రూ.21 వేల వేతనం రూ.31,500కు పెరుగుతుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెప్పారు. కాగా, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు సైతం వేతనాలు పెంచాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లకు 19,500 రూపాయిలు చెల్లిస్తున్నామని వారికి 50 శాతం అదనపు వేతనం చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రస్తుతం 435 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు.