తెలంగాణ

జాతీయ జిడిపి 7.5 శాతం, తెలంగాణలో 10.2 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: అనుకున్న స్థాయిలో లక్ష్యాలు సాధించ లేకపోతున్నామని, తమ ఆరాటానికి, జరుగుతున్న ఆవిష్కరణలకు మధ్య కొంత వెలితి ఉందని, అయినప్పటికీ ఇప్పుడిప్పుడే అనుకున్న మేరకు పని చేయగలుగుతున్నామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్‌కు ఈటలతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని వారన్నారు. జాతీయ జిడిపి 7.5 శాతం కాగా, తెలంగాణ రాష్ట్ర జిడిపి ఆరు మాసాల్లోనే 10.20 శాతంగా నమోదు అయిందని, దేశ జిడిపి కంటే తెలంగాణలో 3 శాతం ఎక్కువ వృద్ధిరేటు నమోదైందని, అయినప్పటికీ తమకు తృప్తి లేదని ఈటల తెలిపారు. వృద్ధి రేటును బట్టి అభివృద్ధి ఉందని అర్థమవుతోందని, వ్యవసాయ రంగంలో వృద్ధి లేకపోతే సంపూర్ణ అభివృద్ధి కాబోదని అన్నారు. తెలంగాణ కొత్త రాష్టమ్రే అయినా అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక దేశాలు మన పథకాల గురించి అడిగి తెలుసుకుంటున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ లాంటి పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారని ఈటల తెలిపారు.