తెలంగాణ

వామపక్షాలకు పనీ పాటా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20:వామపక్షాలకు పనీ పాటా లేదని, వాటి అనుబంధ సంఘాలకు పని లేకుండా పోయిందని, అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అడ్డుకుందామా? అనే పనిలో ఉన్నాయని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వేరువేరుగా జరిగిన విలేఖరుల సమావేశాల్లో విమర్శించారు. సిపిఎం పార్టీకి శాసన సభలో ఒకే సభ్యుడు ఉన్నా గంటకు పైగా మాట్లాడారని చెప్పారు. మాట్లాడే అవకాశం రాలేదు అని సిపిఎం నాయకులు చెప్పడం కాదు, ఎంత సేపు మాట్లాడారో వారి ఎమ్మెల్యే సున్నం రాజయ్యను అడగాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో అడుగడుగునా అడ్డుకున్న సిపిఎం పార్టీకి తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఆలోచనలో మార్పు రాలేదని, తెలంగాణకు ఏ విధంగా ఇబ్బంది కలిగిద్దామా? అనే ఆలోచనలోనే ఉన్నారని అన్నారు. శాసన సభలో సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి తెలంగాణ శాసన సభ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఒక్క రోజు కూడా వృధా కాకుండా సమావేశాలు నిర్వహించుకోగలిగినట్టు చెప్పారు.
సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, తమ్మినేని వాఖ్యలు సభ్యులను అవమాన పరిచే విధంగా ఉన్నాయని అన్నారు. సిపిఎం మొదటి నుంచి తెలంగాణను వ్యతిరేకిస్తోంది, తెలంగాణ వ్యతిరేకత ఆ పార్టీకి నర నరాన జీర్ణించుకుపోయిందని అన్నారు. నోట్ల రద్దుపై చర్చించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని హరీశ్‌రావు గుర్తు చేశారు. సింగరేణి అంశంపై ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పినట్టు తెలిపారు.
సిపిఎం పార్టీకి ఎజెండా లేదని ఎద్దెవా చేశారు. తమ్మినేని లాంటి అబద్ధాల కోరుకు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.
అందుకే నచ్చలేదేమో: జగదీశ్‌రెడ్డి
అరుపులు కేకలు గొడవలు లేకుండా శాసన సభ సమావేశాలు జరిగాయని బహుశా అందుకే కొన్ని పార్టీల వారికి సమావేశాలు నచ్చలేదేమో అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దెవా చేశారు. అన్ని అంశాలపై చర్చ జరిగిందని అన్నారు. ప్రతి ఎన్నికల్లో సిపిఎంకు భంగపాటు తప్పడం లేదని, తెలంగాణ వ్యతిరేక పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారని అన్నారు. అసెంబ్లీని అవమానించే విధంగా తమ్మినేని మాట్లాడుతున్నారని విమర్శించారు. సభలో సిపిఎం సభ్యుడు ఒక్కరుంటే బయట తమ్మినేని ఒక షో నడుపుతున్నారని అన్నారు. ఈసారి సిపిఎంకు ఆ ఒక్క సీటు కూడా రాదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.