రంగారెడ్డి

ఆలయ అభివృద్ధికి కృషి: పట్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల: చేవెళ్లలోని శ్రీలక్ష్మివేంకటేశ్వరస్వామి దేవాలయ అబివృద్ధికి కృషి చేస్తానన్ని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీలక్ష్మివేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో ఎంపిపి బాల్‌రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయాలు క్రమశిక్షణ, ఆధ్యాత్మికతకు నిలయాలుగా నిలుస్తాయని అన్నారు. శివరాత్రి పురష్కరించుకొని చేవెళ్లలో జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని పూజారులకు చూచించారు. టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యరెడ్డి, నాయకులు కృష్ణ, యాదగిరి, శ్రీను, రవీందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, జంగయ్య, మాణిక్యం, శ్రీను పాల్గొన్నారు.
కన్నుల పండువగా దోపోత్సవం
చేవెళ్ల శ్రీలక్ష్మివేంకటేశ్వరస్వామి దోపోత్సవం కన్నులపండుగగా మంగళవారం రాత్రి జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్థానికి హన్‌మాన్ దేవాలయం ముందు ఉన్న పుష్కరిణి వద్దకు ఊరేగింపుతో పల్లకిసేవాలో తీసుకవచ్చారు. అలవేలి మంగమ్మ ఆభరణాలను సెంచులు ఆటపాటాలతో దోచుకొని స్వామివారికి సమర్పించారు.
ముందుగా పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన నాటకం భక్తులను ఎంతగానో అలరించింది. దోపోత్సవం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా అనవాయితీగా వస్తుందని పూజారి రాఘవేంద్రాచారి తెలిపారు. కార్యక్రమంలోచేవెళ్ల ఎంపిపి మంగళి బాల్‌రాజ్, డిసిసి మాజీ అధ్యక్షడు వెంకటస్వామి పాల్గొన్నారు.

నగర టిడిపి అధ్యక్షుడిదీ గులాబీ బాటే

సికింద్రాబాద్, మార్చి 9: అనుకున్నంతా జరిగింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులను అవమానపరుస్తూ టిడిపి నగర అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోఫీనాధ్ సైతం తెరాసలో చేరడానికి రంగం సిద్ధమైంది. తెదేపాలో మిగిలిని ఐదుగురు ఎమ్మెల్యేల్లో నగరానికి చెందిన ముగ్గురిలో ఇద్దరు మాగంటి, అరికెపూడిగాంధీ తమను తెరాస సభ్యులుగా గుర్తించాలని స్పీకర్‌కు లేఖను సమర్పించినట్లు సమాచారం. అయితే ఇక మిగిలిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సైతం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటుండడంతో ఇక నగరంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్లయింది. అధికార తెరాస తెలుగుదేశం పార్టీని పూర్తిగా కోలుకోని దెబ్బతీయడంలో విజయం సాధించిందని చెప్పాలి. తాము కరుడుగట్టిన తెలుగుదేశం అభిమానులమని తమను కోస్తే ఎర్ర రక్తం కాదు పచ్చరక్తమని బీరాలు పలికిన నేతలు అందరికన్నా ముందే సైకిల్ దిగి కారెక్కారు. అందరు వెళ్లిన తర్వాత తాము ఉండి చేయగలిగింది కూడ ఏముందనుకున్నారో ఏమో ఇద్దరు కూడ తాజాగా కారెక్కుతామని ఎక్కించుకోవాలని స్పీకర్‌కు లేఖను ఇవ్వడం పార్టీ కార్యకర్తలను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. ఎంతమంది వెళ్లినా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ కుటుంబానికి నమ్మినబంటును, అత్యంత సన్నిహితుడునని చెప్పుకునే మాగంటి కూడ కారెక్కడానికి సిద్ధపడుతుండడాన్ని పార్టీ అధిష్టానం జీర్ణించుకోలేక పోతుంది.
ఇంత కాలం మాగంటి తనకు పార్టీ దగ్గర ఉన్న పలుకుబడితో చాలా మందిపై కక్షసాధింపు దోరణి ప్రదర్శించి పొమ్మనలేక పొగపెట్టి టిడిపి నుంచి వారిని సాగనంపారు. నగరంలో చాలామంది మాగంటి వ్యవహారం నచ్చక పార్టీని వీడి తెరాసలో చేరిపోయారు. ఇందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ప్రధానంగా ఆయన్ను వ్యతిరేకిస్తున్న ఐదుగురు కార్పొరేటర్‌లుగా తెరాస నుంచి గెలిచి నేడు నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు. వారు మాగంటి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో నగరంలోని చాలామంది నేతలు తెరాసలో చేరినవారు మాగంటి రాకను జీర్ణించుకోలేక పోతున్నారు. తమను తీవ్ర మనస్థాపానికి గురిచేసి పార్టీ నుంచి వెళ్లే విధంగా చేసిన మాగంటి తిరిగి తెరాసలో వస్తుండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడకు వచ్చేది ఆయన తెరాసపై అభిమానంతో కాదని ఆయన స్వార్థ ప్రయోజనాలతోపాటు కోవర్టు ఆపరేషన్‌కే వస్తున్నారని తెదేపా నుంచి తెరాసలో చేరిన నేతలు ఆరోపిస్తున్నారు. నగర అధ్యక్షులుగా ఉన్న బిసి సామాజిక వర్గానికి చెందిన నేత మాజీమంత్రి సి.క్రిష్ణయాదవ్‌పై అనేక ఆరోపణలు చేసి అధిష్టానం దగ్గర ఉన్న పలుకుబడితో ఆయనను అధ్యక్ష పదవి నుంచి అవమానకర పరిస్థితిలో తొలగించారు. అనంతరం ఇక నగర తెలుగుదేశం పార్టీకి తానే పెద్దదిక్కునని పార్టీని పరుగులు పెట్టిస్తానని చెప్పిన మాగంటి అధ్యక్ష పదవి చేపట్టిన నాటినుంచి పార్టీకి తీవ్ర నష్టం కలిగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పాలి.
అందరినీ కలుపుకుపోవాల్సిన ఆయన తన చుట్టూ చేరి చెవులు కొరికేవారికి పెద్దపీట వేసి పార్టీకి అంకితభావంతో పనిచేసే చాలామంది నేతలను పార్టీ నుంచి సాగనంపారు. దానికితోడు గ్రేటర్‌లో పటిష్టంగా ఉన్న తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించలేకపోవడంతో ఒకే ఒక్క సీటుకు పరిమితం చేశారు.
గతంలో అత్యధిక స్థానాలు గెలిచి ఒకటవ స్థానంలో నిలిచిన పార్టీని మాగంటి ఒక్క స్థానాన్ని దక్కించి ఏదైతేనేమి నెంబర్ వన్ స్థానానే్న దక్కించానని సంతృప్తి చెందారు. ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీకి నమ్మినబంటు, ఎన్టీఆర్, నారావారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడునని చెప్పుకునే మాగంటి చివరకు కారు ఎక్కడానికి ఏకంగా స్పీకర్‌కు లేఖ ఇవ్వడం పట్ల దేశం శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి.

ఫతేనగర్ నాలాను సందర్శించిన తలసాని
బాలానగర్, మార్చి 9: గ్రేటర్ శివారు పారిశ్రామికవాడలలోని నాలా పరివాహక ప్రాంతంలోని ప్రజలను వ్యర్ధ రసాయన జలాల నుంచి విముక్తి కలిగిస్తామని రాష్ట్ర వాణిజ్య శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, జోనల్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి తదితర అధికారులతో కలిసి రసాయన వ్యర్ధాల డైవర్షన్ ప్లాంట్‌ను సందర్శించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ నగర్ శివారులోని వివధ పరిశ్రమల నుంచి నాలాల్లో వ్యర్ధ రసాయన జలాలను డంపింగ్ చేస్తుండడంతో దుర్గంధంతో కూడిన వాసనలు వెలువడి బస్తీలలో నావాసముంటున్న ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డిని ఆదేశించారు. డంపింగ్ ప్రాంతాలను గుర్తించి రసాయన వ్యర్ధాలు, జలాలు నాలాల్లో కలుషితం కాకుండా నిరోధించాలని కాలుష్య నియంత్రణ మండలి సెక్రటరీ అనిల్‌కుమార్‌ను ఆదేశించారు. పక్షం రోజుల్లో నివేదికలు రూపొందించాలని సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్, కూతాడి రాములు, గౌండ్ల శ్రీనివాస్‌గౌడ్, కంచి బిక్షపతి, సురేందర్ నాయుడు, గౌస్, కన్నయ్య , సయ్యద్ ఇమ్రాన్, సత్యనారాయణ పాల్గొన్నారు.