తెలంగాణ

గోరటి వెంకన్నకు లోక్‌నాయక్ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), జనవరి 21: కవులు, కళాకారుల వైభవాలను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా పురస్కారాలు అందజేసి మరింత సాహితీ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అన్నారు. లోక్‌నాయక్ నాయక్ ఫౌండేషన్ 13వ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రఖ్యాత కవి, గాయకుడు గోరటి వెంకన్నకు విశాఖలో శనివారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పూర్తిగా అమలు కాని దేశాల్లో కూడా కళలపై నమ్మకం ఉండేదని, ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న ప్రస్తుత కాలంలో కూడా కళ అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కళలకు తగిన గుర్తింపు అవసరమన్నారు. పురస్కారాలు చాలా వస్తుంటాయి, నోబెల్ బహుమతి గ్రహీతలను గొప్పవారిగా భావిస్తుంటాం, అయితే ఎంపిక చేసిన వారి గొప్పతనాన్ని గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో 1960లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి గొప్పతనాన్ని కొనియాడారు. రకరకాల రాజకీయ కారణాలతో ఏర్పడిన నవ్యాంధ్రలో సాహిత, కళా రంగాలను భారతదేశంలో గుర్తింపు తెచ్చే విధంగా ప్రోత్సహించాలన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ సాహిత్య రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో వారికి కూడా గుర్తింపు నిచ్చి ప్రోత్సహించాలన్నారు. పురస్కార గ్రహీత గోరటి వెంకన్న మాట్లాడుతూ ఎందరో మహానుభావుల స్పూర్తితో రచనలు, గేయాలు రాస్తుంటానని, కవిత్వం ఎందుకు రాస్తానో ఒక్కోసారి నాకే తెలియని అనుభవాలు ఎదుర్కొన్నానన్నారు. ఉత్తరాంధ్ర స్థితి గతులపై ఎన్నో కవితలు, గేయాలు రచించి, ఆలపించానని, యాసలో తేడా ఉన్నా భావం ఒక్కటేనన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం కళల కాణాచిగా వర్ణించారు. ఈ సందర్భంగా వాన వైభవం, ఆధునిక సాంకేతికతపై పల్లె ప్రజల్లో వస్తున్న మార్పులపై గీతాలాపన చేసి ఆహుతులను అలరించారు. పురస్కార గ్రహీత గోరటి వెంకన్నకు లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారంతో పాటు రూ.1.5 లక్షల నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు, జ్యుడీషియల్ సంచాలకులు గోడ రఘురాం, నటుడు గొల్లపూడి, అమెరికా నుంచి వచ్చిన ప్రత్యేక ప్రతినిధి తాతా ప్రకాశం పాల్గొన్నారు.

కవి, గాయకుడు గోరటి వెంకన్నకు లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాన్ని
అందజేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్