తెలంగాణ

పాలమూరు ప్రొఫెసర్‌కు రాష్టప్రతి గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన కుగ్రామం అంకిరావుపల్లికి చెందిన డాక్టర్ ఎ. శ్రీరాములుకు భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ అరుదైన గౌరవాన్ని అందించారు.
ఆయనను ఒరిస్సా సెంట్రల్ యూనివర్సిటీ పాలక మండలిలో (ఎగిక్యూటివ్ కౌన్సిల్) ఒక సభ్యుడిగా తన నామినీగా నియమించారు. శ్రీరాములుతో పాటు మరో నలుగురిని కూడా ప్రణబ్ ముఖర్జీ తన తరపున సభ్యులుగా నియమించారు. దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలన్నింటికీ భారత రాష్టప్రతి అధిపతిగా ఉంటారు. సాంకేతికంగా రాష్టప్రతిని సెంట్రల్ యూనివర్సిటీలకు ‘విజిటర్’గా పిలుస్తారు. శ్రీరాములు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని డిగ్రీకాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. మ్యాథమెటిక్స్‌లో ఆయనది అందెవేసిన చేయి. డిగ్రీకాలేజీ లెక్చరర్లకు ప్రస్తుతం ప్రొఫెసర్ హోదాను ప్రభుత్వం కల్పించింది. మహబూబ్‌నగర్‌లోని ఎంవిఎస్ డిగ్రీకాలేజీ నుండి బిఎస్‌సి చదివి, ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పిహెచ్‌డి పూర్తి చేశారు. 1985లో మ్యాథమెటిక్స్ లెక్చరర్‌గా నియామకం అయిన శ్రీరాములు మహబూబ్‌నగర్‌లోని ఎంవిఎస్ డిగ్రీకాలేజీతో సహా వివిధ ప్రాంతాల్లోని డిగ్రీకాలేజీల్లో పనిచేశారు. 2010 నుండి హయత్‌నగర్ కాలేజీలో పనిచేస్తున్నారు. డిగ్రీకాలేజీల్లోని విద్యార్థులకు ‘మధ్యాహ్న భోజన పథకం’ హయత్‌నగర్‌లో ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. మల్కాజిగిరి డిగ్రీకాలేజీకి కూడా ఆయన ఇంచార్జి ప్రన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. మ్యాథమెటిక్స్‌లో ఆయన పుస్తకాలు కూడా రాశారు. శ్రీరాములు సేవలను గుర్తించిన భారత రాష్టప్రతి ఒరిస్సా కేంద్ర విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో చోటు ఇచ్చి గౌరవించారు.