తెలంగాణ

దివ్యాంగుల రిజర్వేషన్లు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: దివ్యాంగులకు 3 నుంచి 4 శాతానికి రిజర్వేషన్లను కేంద్రం పెంచిందని కేంద్ర న్యాయ, సాధికారతశాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి అథవాలే మీడియాతో మాట్లాడుతూ, కుల నిర్మూలనకు, కులాంతర వివాహాలకు మద్దతు ఇవ్వడం వల్ల అంటరానితనం నిర్మూలించవచ్చన్నారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి అంబేద్కర్ పథకం కింద ఎస్‌సి జంటకు రూ.2.50 లక్షల ప్రోత్సహకాన్ని అందిస్తుందన్నారు. ప్రతి రాష్ట్రానికి ఎస్‌సి జనాభా దమాషా ప్రకారం నిర్దిష్ట లక్ష్యాన్ని ఖరారు చేస్తున్నామన్నారు. ఎస్‌సి ఉప ప్రణాళికలకు తెలంగాణ ప్రభుత్వం రూ.10,484 కోట్లు సమకూర్చగా, ఇందులో రూ.7,800 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూర్చిందని రాందాసు అథవాలే వివరించారు. దేశవ్యాప్తంగా మెట్రిక్యులేషన్ అనంతరం 2,78,333 మంది ఎస్‌సి విద్యార్థులకు రూ.331 కోట్ల ఉపకార వేతనాలను కేంద్రం ఇస్తుందన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలలో చదువుకునే ఎస్‌సి విద్యార్థులకు రూ.30 లక్షల నుంచి 50 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు ఇస్తుందన్నారు.