తెలంగాణ

సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 22: ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ప్రతి బ్రాహ్మణుడూ మందుకు సాగాలని బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ గంగు భానుమూర్తిశర్మ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా రిమ్మనగూడ శివారులో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఐక్యవేదిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖా భేదం లేకుండా బ్రాహ్మణులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, బ్రాహ్మణ సంఘం ప్రముఖుల వత్తడి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు రూ. 100 కోట్లతో సంక్షేమ నిది ఏర్పాటు చేయడంతోపాటు 7 ఎకరాల స్థలం కేటాయించి ట్రస్టు ఏర్పాటుకు ముం దుకు వచ్చినట్లు తెలిపారు. సమాజంలో బ్రాహ్మణుడికి మంచి గౌరవం, గుర్తింపు ఉందని, వేద ధర్మాన్ని ఆచరిస్తూ లోకకల్యాణార్ధం విస్తృతంగా యజ్ఞ యాగాదులు నిర్వహించాలని కోరారు. బ్రాహ్మణత్వానికి విఘాతం కలగకుండా, వ్యక్తిత్వం కాపాడుకుంటూ, హిందూ దర్మ విశిష్టతను చాటి చెప్పి సమాజ మార్పునకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వాన సంఘ అధ్యక్షుడు బండారు రామప్రసాదరావు అధ్యక్షత వహించగా, సంఘ ప్రముఖులు పతంగి కమలాకర శర్మ, వెన్నంపల్లి జగన్‌మోహన్ శర్మ, గంగు ఉపేంద్ర శర్మ, అష్టకాల రాంమోహన శర్మ, లోక రవిచంద్ర, హన్మంతరావు, మంగు హరిహర రావు, వేలేటి మృత్యుంజయ శర్మ, రాజశేఖర శర్మ, గోపాలకృష్ణ శర్మ, ఆంజనేయ శర్మ, బెజుగామ నాగేందర్‌రావు, నందబాల శర్మ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సదస్సులో ప్రసంగిస్తున్న గంగు భానుమూర్తి శర్మ