తెలంగాణ

ఐటి హబ్‌గా వరంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 22: రాష్ట్రంలోని రెండవ పెద్దనగరం వరంగల్‌ను ఐటి హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం ఐటి కంపెనీలన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు పరిమితమయ్యాయని, అభివృద్ధి అన్ని ప్రాం తాలలో జరగాలనే ఉద్దేశ్యంతో ప్రభు త్వం వరంగల్‌కు ఐటి కంపెనీల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని చెప్పారు. వరంగల్ నగరాన్ని కేంద్రం హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీగా ప్రకటించిందని, అదే విధంగా రాష్ట్రప్రభుత్వం వరంగల్‌ను ఇండస్ట్రియల్ హబ్‌గా, ఐటి హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలోని మడికొండ ఐటి సెజ్‌లోని ఇంక్యుబేషన్ సెంటర్‌లో ప్రముఖ ఐటి సంస్థ సియంట్స్ ఏర్పాటుచేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం మాట్లాడుతూ గతంలో వరంగల్‌లో ఐటి సెజ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా సంబంధిత కంపెనీ పనులు ప్రారంభించడంలో జాప్యం జరిగిందని, తమ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా మడికొండలో 45 ఎకరాలలో ఐటి సెజ్ ఏర్పా టు జరిగిందని, ఐటి కంపెనీల ఏర్పాటుకు 10 కోట్ల రూపాయలు ఖర్చుచేసి అవసరమైన అన్ని వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిందని అన్నా రు. రెండవ విడతలో మరో ఆరుకోట్ల రూపాయలు ఖర్చు చేసి మరింత స్థలం, సదుపాయాలు అం దుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ మూడు కంపెనీలు పనిచేస్తున్నాయని, ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చేస్తున్న ప్రయత్నాల కారణంగా త్వర లో మరో నాలుగు, ఐదు ఐటి కంపెనీలు ఇక్కడ ఏర్పాటు జరుగుతాయని చెప్పారు. దీనివల్ల ఐటి, సాఫ్ట్‌వేర్ రంగాల్లో స్థానికంగా రెండు, మూడువేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. దేశంలోనే కాకుం డా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఐటి కంపెనీలలో వరంగల్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారని, ఇక్కడ ఐటి కంపెనీలు భారీగా ఏర్పాటైతే వీరందరి సేవలు అందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సియంట్స్ కంపెనీ చైర్మన్ బివి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు జరిగాయని, ఇంకా జరుగుతున్నాయ ని చెబుతు ఈ మార్పులను అందింపుచ్చుకుంటే ఐటి రంగంలో మరింత అభివృద్ధి సాధించవచ్చని చెప్పారు. 1973లో కాన్పూర్ ఐఐటిలో తాను మొదటిసారిగా కంప్యూటర్‌ను చూ సానని, ఈ 44 సంవత్సరాలలో డిజిటల్, కంప్యూటింగ్ పవర్ ఎంతో అం దుబాటులోకి వచ్చిందని, దీనిని సంపూర్ణంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థకు 24 డెవలప్‌మెంట్ సెంటర్లు ఉన్నాయని, అందులో 12 కేంద్రాలు ఇండియాలో ఉన్నాయని చెప్పారు. కొత్త డెవలప్‌మెంట్ సెంటర్‌కు అవసరమైన వౌలిక సదుపాయాలు, మానవ వనరులకు సంబంధించి ఇంజనీరింగ్ కళాశాలలు, దీనికితోడు ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా వరంగల్‌లో తమ సంస్థ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటుకు ముందుకు వచ్చిందని అన్నారు. ప్రపంచంలోని ఎక్కడినుంచో డాటా వస్తోంది... ఇక్కడినుం చి పనులు పూర్తిచేస్తున్నారు, సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యమని ఇది రుజువు చేస్తోందని అన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన యూనిట్ ద్వారా ప్రసుతం వందమందికి ఉద్యో గ అవకాశాలు లభించాయని, త్వర లో మరో వందమందికి అవకాశం లభిస్తుందని చెప్పారు. సంస్థకు సంబంధించిన సొంత భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తిచేస్తామని, అప్పుడు కనీ సం రెండువేలమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, 70 శాతం మంది స్థానికులకు అవకాశాలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ పద్మ, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ నగర మేయర్ నరేందర్, పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, టిఎస్‌ఐఐసి రీజనల్ మేనేజర్ రాథోడ్ పాల్గొన్నారు.

చిత్రం..సియంట్ ఐటి కంపెనీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను
ప్రారంభించి పరిశీలిస్తున్న ఉపముఖ్యమంత్రి కడియం