తెలంగాణ

గజ్వేల్ చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి రూ.230 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 22: గజ్వేల్ చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టడానికి రూ. 230 కోట్ల రూపాయలు కేటాయంచనున్నట్టు భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు రేడియల్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ శివారులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో 1200 ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ పరి ధిలోని అర్హులైన నిరుపేదలందరికీ డబల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామని, ఇందుకోసం రూ. 110 కోట్లు కేటాయించనున్నామన్నారు. 64 ఎకరాల విస్తీర్ణంలో డబల్ బెడ్‌రూం ఇళ్ల్ల నిర్మాణం చేపడుతుండగా, సిసి రోడ్లు, విద్యుత్, అండర్ డ్రైనేజీ తదితర స కల సౌకర్యాలు కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.
షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుతోపాటు శుభకార్యాల కోసం ఫంక్షన్‌హాల్ మంజూరీ చేస్తున్నట్లు చెప్పారు. అయితే యేడాది లోపు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లాటరీ పద్ధతిన ఇళ్లు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం రూ. 20 కోట్లు కేటాయిస్తుండగా, నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని ఆయన అధికా రులను ఆదేశించారు. రూ. 2 కోట్లతో గజ్వేల్‌లో వైకుంఠధామం నిర్మిస్తుండగా, పాండవుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు చర్య లు చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శాఖాహార, మాంసాహార మార్కెట్‌ల కోసం చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ దుంబాల అరుణబూపాల్‌రెడ్డి, ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, ఎంపిపి అధ్యక్షుడు చిన్నమల్లయ్య, జెడ్‌పిటిసి వెంకటేశంగౌడ్, నేతలు బూంరెడ్డి, టేకులపల్లి రాంరెడ్డి, మాదాసు శ్రీనివాస్, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. గజ్వేల్‌లో 1200 ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు.