తెలంగాణ

వేలాది మందితో ఆత్మరక్షణ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జనవరి 24: జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలో వేలాది మంది విద్యార్థినులు ఆత్మరక్షణపై ప్రదర్శన నిర్వహించి గిన్నీస్‌బుక్ రికార్డు సాధించారు. జిల్లా పరిధిలోని 13 మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు చెందిన 13,683 మంది విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్ విధానంలో ఆత్మరక్షణపై 36 నిముషాల పాటు ప్రదర్శన నిర్వహించారు. గిన్నీస్‌బుక్ రికార్డు పర్యవేక్షకుడు జయసింహ సమక్షంలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు లక్ష్మి, రవి సారధ్యంలో విద్యార్థినులు ఏకధాటిగా ఈ ప్రదర్శన నిర్వహించి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘సంఘటిత సబల’ వేదికకు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అధ్యక్షత వహించగా ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, వరంగల్ ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపి బూర నర్సయ్య, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పూల రవిందర్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డా. తాటికొండ రాజయ్య గిన్నీస్ రికార్డు ధ్రువీకరణ ఫొటోను కలెక్టర్ శ్రీదేవసేనకు అం దజేసి అభినందించారు. అనంతరం డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థినులు సెల్ఫ్ డిఫెన్స్‌లో తర్ఫీదు పొంది అబ్బురపడేలా ప్రదర్శనలిచ్చి జనగామను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లడం ప్రశంసనీయమన్నారు. రాణీరుద్రమదేవి, చాకలి ఐలమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సమాజంలో ఆదర్శవంతులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సిపి సుధీర్‌బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రేమలతారెడ్డి, జెసి గోపాలకృష్ణ ప్రసాద్‌రావు, డిఇవో యాదయ్య, మహిళా శిశుసంక్షేమ శాఖ, డిడబ్ల్యూవో పద్మజారమణ, ఎసిడిపివో ప్రేమలతలు పాల్గొన్నారు.

చిత్రం..కలెక్టర్‌కు గిన్నిస్‌బుక్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తున్న డిప్యూటీ సిఎం కడియం