తెలంగాణ

ఔటర్ చుట్టూ గ్రోత్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 13 ట్రాన్సిట్ ఓరియెంటెడ్ గ్రోత్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. ఈ సెంటర్ల ఏర్పాటుకు దాదాపు రూ.14వేల కోట్ల వ్యయమవుతుంది. ఇందులో భాగంగా తొలి మోడల్ టౌన్‌షిప్‌ను ఆదిభట్ల వద్ద నిర్మించనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ), పరిశ్రమల శాఖ ఉమ్మడిగా ఈ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నాయి. 13 ట్రాన్సిట్ ఓరియెంటెడ్ గ్రోత్ సెంటర్ల ఏర్పాటు ప్రాజెక్టు నివేదికను కేంద్రంతో పాటు వివిధ ఆర్థిక ఏజన్సీలకు ఇచ్చి ఆర్ధికంగా నివేదికలను సమకూర్చుకోవాలని మున్సిపల్ శాఖ యోచిస్తోంది. గ్రోత్ సెంటర్లలో వౌలిక సదుపాయాలు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీరు, రవాణా వ్యవస్ధను ఏర్పాటు చేస్తారు.
ఘటకేసర్‌లో ఐటి మెడికల్ పార్కు, పెద్ద అంబర్‌పేటలో కూరగాయల మార్కెట్ హబ్, షామీర్‌పేటలోప్రాంతీయ రిక్రియేషనల్ సెంటర్లు, కీసరలో నాలెడ్జ్ హబ్, గుండ్ల పోచమ్మలో బయోటెక్, ఫార్మాహబ్, పటాంచెర్వు వద్ద ఇన్నోవేషన్ సెంటర్, హోల్ సేల్ మార్కెట్, తెల్హాపూర్ వద్ద ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో, ఆదిభట్ల ఐటి ఏవియేషన్ హబ్, తిమ్మాపూర్ వద్ద ఫార్మా హబ్, మేడ్చల్ వద్ద ఐటి హబ్, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. మొత్తం నాలుగు వేల ఎకరాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ అవసరమైన భూమిని సేకరించాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ పారిశ్రామిక రంగం, హైదరాబాద్ నగర శివార్ల ముఖ చిత్రాన్ని గ్రోత్ సెంటర్లు మార్చివేస్తాయని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్ధ (టిఎస్‌ఐఐసి) వైస్‌చైర్మన్ వెంకట నరసింహారెడ్డి తెలిపారు. గ్రోత్ సెంటర్ల వద్ద మినీ టౌన్స్‌ను కూడా నిర్మించాలని రిపోర్టలో ప్రతిపాదించారు.