తెలంగాణ

సౌర విద్యుత్‌కు మూడు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: సౌర విద్యుత్ ఉత్పత్తిలో (వ్యక్తిగత విభాగం) దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానం ఆక్రమించింది. జాతీయ స్థాయిలో జిల్లాల విభాగంలో రంగారెడ్డి, మెదక్ జిల్లాలు మొదటి, రెండవ స్థానంలో నిలిచాయి. ప్రతి ఏటా ఇచ్చే అవార్డులకుగాను ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల 2014-15, 2015-16 సంవత్సరాలకుగాను తెలంగాణ రాష్ట్రానికి మూడు అవార్డులు లభించాయి. సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడంలో దేశం మొత్తం మీద కేరళ తొలి స్థానంలో నిలువగా తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. గరిష్టంగా 670 వ్యక్తిగత సౌర విద్యుత్ ప్లాంట్లలో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలోనూ, 355 ప్లాంట్లతో మెదక్ జిల్లా రెండో స్థానంలో నిలిచాయి.
కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఈ మూడు అవార్డులను ఢిల్లీలో మంగళవారం ప్రదానం చేయగా వీటిని రాష్ట్రం తరఫున సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఏ సుధాకర్‌రావు, ఇంధన కార్యదర్శి అజయ్ మిశ్రా అందుకోగా రంగారెడ్డి జిల్లా తరఫుర కలెక్టర్ రఘునందన్‌రావు, మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హోరికెళి అందుకున్నారు.