తెలంగాణ

ఫిబ్రవరిలో గ్రూప్-2 ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్-2 ఫలితాలను వచ్చే నెల రెండో వారంలో విడుదల చేస్తామని కమిషన్ చైర్మన్ డాక్టర్ ఘంటా చక్రపాణి చెప్పారు. 2011 నాటి నోటిఫికేషన్ 15, 18 గ్రూప్-1 పోస్టుల ఫలితాలను కూడా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేస్తామని వివరించారు. గురువారం నాడు ఆయన గణతంత్ర వేడుకల సందర్భంగా నాంపల్లిలోని టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కమిషన్ సభ్యులు, ఉద్యోగులు జాతీయ గీతాన్ని ఆలాపించారు.మార్చి మొదటి వారంలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని తెలిపారు.
అలాగే గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి కూడా ఈ నెలాఖరున ప్రకటన ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది 8వేల ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. టిఎస్‌పిఎస్‌సి ఏర్పడిన నాటి నుండి ఇంత వరకూ రాష్ట్రంలో ఐదువేల ఖాళీలను భర్తీ చేశామని వివరించారు.
జిందాల్ వర్శిటీలో జర్నలిజం కోర్సులు
జిందాల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్‌లో మూడేళ్ల ఫుల్ టైమ్ బిఎ హానర్స్ ప్రోగాం నిర్వహిస్తోంది.
మీడియా అండ్ కమ్యూనికేషన్ కోర్సులో చేరి జర్నలిస్టులుగా, ఎడిటర్లుగా, వెబ్ ఎడిటర్లుగా, టీవీ ప్రొడ్యూసర్లుగా, యాంకర్లుగా నిలదొక్కుకునేందుకు ఈ కోర్సు దోహదపడుతుందని యూనివర్శిటీ పేర్కొంది. హర్యానా ప్రైవేటు యూనివర్శిటీల చట్టం కింద ఈ యూనివర్శిటీ ఏర్పాటైందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సి రాజ్‌కుమార్ పేర్కొన్నారు.