తెలంగాణ

తెలుగులో మొదలు, ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన రాష్టస్థ్రాయి గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగం తెలుగులో ప్రారంభమై, ఇంగ్లీషులో కొనసాగి, తిరిగి తెలుగు వాక్యాలతో ముగిసింది. నరసింహన్ తమిళనాడుకు చెందినవారు కావడంతో తెలుగులో స్పష్టంగా మాట్లాడలేకపోయారు. 15 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది.
పరేడ్ గ్రౌండ్స్‌కు గవర్నర్ సరిగ్గా 10.30 గంటలు చేరుకున్నారు. విజయవాడలో గురువారం ఉదయం 8 గంటలకే ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని, హెలికాప్టర్‌లో హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. హెలికాప్టర్ నుండి దిగగానే నేరుగా ఆయన పరేడ్ గ్రౌండ్స్‌కు చేరారు. ఆయన వెంట లేడీ గవర్నర్ విమల కూడా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సికింద్రాబాద్‌లోని ఇఎంఇ మిలిటరీ కాలేజ్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ జస్తేజ్ సింగ్ తదితరులు గవర్నర్‌కు పరేడ్ గ్రౌండ్స్ వద్ద స్వాగతం పలికారు. గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన కార్యక్రమంలో దాదాపు గంటపాటు గడిపారు. 10.32 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేసి, సైనికులు, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. గ్రౌండ్స్‌లో పరేడ్‌లో భాగంగా నిలబడ్డ పోలీసులు, సైనికులు, ఎన్‌సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను పరిశీలించారు. ఆ తర్వాత గవర్నర్ వేదిక వద్దకు రాగానే పోలీసులు, సైనికుల మార్చ్ఫాస్ట్ జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు.
గణతంత్ర దినోత్సవం గొప్ప జాతీయ పండగ అని, 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి చెందుతోందని తెలుగులో పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి వివరిస్తున్నట్టు ప్రకటించారు. 16 పేజీల ప్రసంగ పాఠంలో 15 పేజీలు ఇంగ్లీషులో కొనసాగింది. చివరగా మళ్లీ తెలుగులో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలంతా సుఖంగా, సంతోషంగా ఉండేలా ప్రభుత్వ పథకాలు ఉంటాయని ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమల్లో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ప్రసంగాన్ని గవర్నర్ ముగించారు. రాష్టస్థ్రాయి గణతంత్ర వేడుకలకోసం అధికారికంగా రూపొందించిన ‘మినట్ టు మినట్’ అజెండా ప్రకారమే పొల్లుపోకుండా కార్యక్రమం కొనసాగింది.
అమర జవాన్లకు కెసిఆర్ నివాళి
ఇలా ఉండగా ఉదయం 10.17 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోనే ఉన్న ‘వీరుల సైనిక స్మారకం’ వద్దకు చేరారు. స్మారక స్థూపం వద్ద పూలమాల వేసి దేశం కోసంప్రాణాలు అర్పించిన సైనికులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత అక్కడే టేబుల్‌పై ఉన్న ‘విజిటర్స్ బుక్’లో కెసిఆర్ తన అభిప్రాయాలను రాశారు. ఆ తర్వాత సమీపంలోని పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని గణతంత్ర ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన
గణతంత్ర వేడుకల్లో ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్