తెలంగాణ

పోలీసు వ్యవస్థ బలపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: నేరాల అదుపు, ఆధునిక టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, అయితే పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన డిజిపి కార్యాలయంలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేకించి తెలంగాణకు ఎలాంటి హెచ్చరికలు, ఆదేశాలు రాలేదన్నారు. అయినా అప్రమత్తతతో వ్యవహరించామని తెలిపారు. దాదాపు 3వేల పోలీస్ బలగాలతో బందోబస్తు నిర్వహించామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని ఆయన తెలిపారు.
జైళ్లశాఖ ఆధ్వర్యంలో..
చర్లపల్లి, చంచల్‌గూడ కారాగారాల్లో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వికె సింగ్ జాతీయ జెండా ఎగురవేసి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ కేంద్ర కారాగారంలో ఐదు ప్లాటూన్లు పాల్గొన్నాయి. చర్లపల్లి, వరంగల్ రేంజ్‌లకు సంబంధించి 3స్క్వాడ్స్ పరేడ్‌లో పాల్గొన్నాయి. డ్రిల్‌తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎంఆర్ భాస్కర్, చర్లపల్లి జైలు చీఫ్ హెడ్ వార్డర్ పి విజయ్‌కుమార్‌లతోపాటు ఎ.నర్సింహ, సంపత్, దశరథరాంలకు అవార్డులు లభించడాన్ని ఆయన ప్రశంసించారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.