తెలంగాణ

మూడోసారీ ఆడపిల్ల పుట్టిందని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జనవరి 27: ఆడపిల్లలపై వివక్ష నానాటికీ తీవ్రమవుతోంది. ఆడపిల్లలపై వివక్ష వద్దని జిల్లా కలెక్టర్, ఎస్పీలు గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామంలో అమ్మానన్ను చంపకే అన్న నినాదంతో అవగాహన సదస్సు నిర్వహించి రెండు రోజులైనా కాకముందే చందంపేట మండలం పోల్యానాయక్ తండాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అధిక సంతానాన్ని భారంగా భావించి కన్నతల్లిదండ్రులే ఆరు రోజుల వయస్సు ఉన్న ఆడపిల్లను హతమార్చారా లేక అనారోగ్యంతోనే శిశువు మృతి చెందిందా? అన్న విషయం అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించి దేవరకొండ సిడిపివో సక్కుబాయి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చందంపేట మండలం పోల్యానాయక్ తండాకు చెందిన మూడావత్ శారద, మంగ్తా దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం. వీరిలోఒక మగపిల్లవాడు, ఇద్దరు ఆడపిల్లలు. శారద ఈ నెల 21 వ తేదీన దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో నాలుగో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 26 వ తేదీన శిశువు అనారోగ్యంతో ఉందని శారద దేవరకొండ పట్టణం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి శిశువుకు చికిత్స చేయించింది. అనంతరం శారద కూతురుతో సహా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పోల్యానాయక్‌తండాకు వచ్చింది. తండాకు వచ్చిన కొద్ది సేపటికే శిశువు వాంతి చేసుకొని మరణించిందని శారద తండావాసులకు చెప్పి శిశువును ఖననం చేసింది. అయితే ఈ విషయాన్ని ఆనోటా, ఈ నోటా తెలుసుకున్న సిడిపివో సక్కుబాయి, తహశీల్దార్ యాకూబ్, ఎపీడివో రామకృష్ణలు శుక్రవారం తండాకు వెళ్ళి శిశువు మృతిపై విచారణ జరిపారు. ఆరోగ్యంతో ఉన్న శిశువు కొద్ది సేపట్లోనే మరణించడం పట్ల అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. శిశువును తీసుకెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రికి కూడా అధికారులు వెళ్ళి విచారణ జరిపారు. శిశువును తన వద్దకు తీసుకొచ్చినప్పుడు శిశువు ఆరోగ్యంగా ఉందని చనిపోయేంత స్ధితిలో బాలిక లేదని వైద్యుడు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. శనివారం తండాకు వెళ్ళి మళ్ళీ విచారణ జరుపుతామని శిశువు మృతిపై పూర్తి సమాచారం సేకరిస్తామని సిడిపివో సక్కుబాయి తెలిపారు.

చిత్రం..శిశువు తల్లిని విచారిస్తున్న అధికారులు