తెలంగాణ

98శాతం గుడుంబా నిర్మూలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: రాష్ట్రంలో గుడుంబాపై ఉక్కు పాదం మోపి 98శాతం వరకు గుడుంబాను నిర్మూలించగలిగినట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గుడుంబా రహిత తెలంగాణగా మార్చేందుకు ఎక్సైజ్ ఉద్యోగులు నిరంతరం శ్రమించారని అన్నారు. దూల్‌పేట వంటి ప్రాంతాన్ని సైతం గుడుంబా రహితంగా మార్చినట్టు చెప్పారు. గుడుంబాపై ఆధారపడి జీవించే వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపేందుకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించనున్నట్టు చెప్పారు. ప్రతి కుటుంబానికి ఐదులక్షల రూపాయలు కేటాయించి వారికి జీవనోపాధి కల్పించనున్నట్టు చెప్పారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ మొదలుకొని పై స్థాయి అధికారి వరకు అందరూ నిరంతరం శ్రమించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ ఎక్సైజ్ ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసునని, శాఖలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. ముఖ్యమంత్రితో త్వరలోనే చర్చించి సమస్యలు పరిష్కరించనున్నట్టు చెప్పారు. తెలంగాణలోని 138 ఎక్సైజ్ స్టేషన్లలో 12 స్టేషన్లకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని చెప్పారు. మిగిలిన వాటిని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని ఆయా జిల్లాల కలెక్టర్లతో చర్చించి అన్ని స్టేషన్లకు సొంత భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. తాను ముందుగా నియోజక వర్గం అభివృద్ధి నిధి నుంచి 50లక్షల రూపాయలు కేటాయించి నియోజక వర్గంలో రెండు స్టేషన్లను నిర్మించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలండర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి పద్మారావు