తెలంగాణ

2018లోగా ఇంటింటికీ మరుగుదొడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: వచ్చే సంవత్సరం అక్టోబర్ 2 లోగా తెలంగాణలో ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండే విధంగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. రాజేంద్రనగర్‌లోని టిసిపార్డ్‌లో జిల్లా పంచాయితీ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సమీక్ష జరిపారు. జాబ్ కార్డ్ ఉన్న ప్రతి కూలీకి 100 రోజుల పని కల్పించాలని చెప్పారు. ఉపాధి నిధులతో గ్రామ పంచాయితీ, అంగన్ వాడి భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.
నాటిన ఏ ఒక్క మొక్క ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామ పంచాయితీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కంప్యూటరీకరించాలని, జమా ఖర్చులన్నీ ఆన్‌లైన్‌లో ఉంచాలని చెప్పారు. గ్రామాల్లో వైకుంఠధామం, స్మృతి వనాల ఏర్పాట్లపై దృష్టిసారించాలని చెప్పారు. గ్రామ పంచాయితీల వారిగా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. టిఎస్‌ఐపాస్ దరఖాస్తులు జిల్లా స్థాయిలో సత్వరం పరిష్కరించాలని చెప్పారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్ మాట్లాడుతూ పంచాయితీ సిబ్బందిని రేషనలైజేషన్ చేయడంతో పాటు డిప్యూటేషన్లు నిలిపివేయనున్నట్టు చెప్పారు. క్లస్టర్ గ్రామాల నుండి సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు కమిషనరేట్‌కు పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.